బీజేపీ ఎంపీపై కత్తులతో దాడి.. 100 మంది కలిసి నడి రోడ్డుపై..

రోడ్డుపై ఎంపీ కాన్వాయ్‌ను ఆపి ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బీజేపీ, గోర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలతో కలిసి వెళ్తుండగా 80-100 మంది వ్యక్తులు దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: October 22, 2019, 6:57 PM IST
బీజేపీ ఎంపీపై కత్తులతో దాడి.. 100 మంది కలిసి నడి రోడ్డుపై..
బీజేపీ ఎంపీపై దాడి
  • Share this:
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎంపీ రాజు బిస్తాపై సుమారు 100 మంది దాడి చేశారు. కత్తులు, ఖుక్రీ వంటి పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే రాజు బిస్తాపై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనంతరం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమవడంతో ఎంపీ రాజు బిస్తా క్షేమంగా బయటపడ్డారు.

సింజి నుంచి కలింగ్‌పోంగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుపై ఎంపీ కాన్వాయ్‌ను ఆపి ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బీజేపీ, గోర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలతో కలిసి వెళ్తుండగా 80-100 మంది వ్యక్తులు దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారిలో చాలా మంది మద్యం తాగి ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులకు పోలీసులు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.



First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>