వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా పేరును మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా విద్వేషాలు నింపేలా ఉందని, టైటిల్ ఉందని హైదరాబాద్లోని రీజినల్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కథను క్షుణంగా పరిశీలించాకే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. కేవలం సంచలనాలు, ఆదాయం కోసం ఇలాంటి టైటిళ్లు పెడుతున్నారని, సామాజిక స్పృహ లేకుండా సినిమాలు తీయొద్దని సూచించారు. టైటిల్ కూడా మార్చాలని, లేదంటే ఉద్యమం చేస్తామని రమేష్ నాయుడు హెచ్చరించారు.
మరోవైపు ఈ సినిమా టైటిల్ వివాదంపై ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ‘నా సినిమా నా ఇష్టం. సెన్సార్ బోర్డు రద్దు చేసే నాకే నష్టం. మిమ్మల్ని సినిమా చూడమని నేనేం చెప్పలేదు. చెప్పను కూడా.’ అని వ్యాఖ్యానించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:October 29, 2019, 22:09 IST