స్థానిక ఎన్నికలు.. ఏపీ గవర్నర్‌కు బీజేపీ లేఖ..

స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది.

news18-telugu
Updated: April 28, 2020, 8:54 AM IST
స్థానిక ఎన్నికలు.. ఏపీ గవర్నర్‌కు బీజేపీ లేఖ..
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (File)
  • Share this:
స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఏకగ్రీవాల రచ్చ, కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం, ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం, ఆ వ్యవహారంపై కోర్టుకు వెళ్లడం.. ఇలా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దు చేయాలని బీజేపీ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాసింది. ఎన్నికలను క్యాన్సిల్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ మేరకే లేఖ రాశారు. దాడులు, దౌర్జన్యాలతో అధికార పార్టీ చాలా చోట్ల ఏకగ్రీవం చేసుకుందని ఆ పార్టీ దైర్జన్యాలకు అధికారులు, పోలీసులు సహకరించారని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి దౌర్జన్య కాండ ఎన్నడూ జరగలేదని, స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ నిర్వహించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌కు కన్నా విజ్ఞప్తి చేశారు.
First published: April 28, 2020, 8:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading