తెలంగాణలో ఆ రెండు ఎంపీ సీట్లు బీజేపీవే...మాజీ సీఎం జోస్యం

కర్నాటకలో త్వరలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని...అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: May 15, 2019, 4:16 PM IST
తెలంగాణలో ఆ రెండు ఎంపీ సీట్లు బీజేపీవే...మాజీ సీఎం జోస్యం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 15, 2019, 4:16 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. టీఆర్ఎస్‌ని ఓడించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి..బీజేపీ అగ్రనేతలతో ప్రచారం నిర్వహించింది. మొత్తం 17 స్థానాల్లో నాలుగైదు స్థానాలపై భారీ ఆశలు పెట్టుకుంది కమలదళం. ఈ క్రమంలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై కర్నాటక సీఎం యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, మహబూబ్ నగర్ లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకుంటుంకని జోస్యం చెప్పారు.

కేంద్రంలో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని ధీమావ్యక్తం చేశారు యడ్యూరప్ప. బీజేపీ 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని చెప్పారు. కర్నాటకలో బీజేపీకి 20-22 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో పర్యటించిన యడ్యూరప్ప..భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో త్వరలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని...అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టంచేశారు.
యడ్యూరప్ప


First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...