BJP WILL WIN AGAIN IN UP MODI SAYS OPPOSITIONS ARE LOOKING TO COMPLICATE THE CRISIS SNR
Modi: యూపీలో మళ్లీ గెలిచేది బీజేపీనే..ఎస్పీ, కాంగ్రెస్‌కి ప్రధాని కౌంటర్
(యూపీ ఎన్నికల్లో వార్ వన్ సైడే)
Modi: యూపీలో చివరి దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారణాసిలో ఓటర్లను ఉద్దేశించి యూపీలో మళ్లీ బీజేపీ గెలుస్తుందన్నారు. ఎస్పీ, కాంగ్రెస్ దేశానికి ఏం చేయలేదు, ఏం చేయవనే సంకేతాన్ని ప్రజలు చేరవేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తిరకమైన వ్యాఖ్యలు చేశారు. మార్చి(March)7వ తేదిన ఉత్తరప్రదేశ్‌లో చివరి దశ ఎన్నికల కోసం ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. వారణాసి(Varanasi)లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలోసమాజ్వాది పార్టీ(Samajwadi party)ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోయేది బీజేపీ(Bjp) ప్రభుత్వమేనన్న నమ్మకం తనకుందన్నారు. భారతదేశం ఎన్నో సంక్షోభ సమయాలను బీజేపీ సమర్ధవంతంగా ఎదుర్కొందని చెప్పారు. కాని కొన్ని పార్టీలు వాటిని రాజకీయంగా వాడుకోవాలని చూశాయన్నారు. గతంలో కరోనా కష్టకాలంలోనే కాదు ప్రస్తుతం ఉక్రెయిన్(Ukraine),రష్యా(Russia)మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా అదే కుటిల రాజకీయాలు చేయాలని చూస్తోందని కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి, మంచి పనుల్ని ప్రజలు చూస్తున్నారని..బీజేపీ పాలనలో దేశంలోని పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని మోదీ చెప్పారు.
యూపీలో గెలిచేది బీజేపీనే..
కరోనా విపత్కర పరిస్థితులు, ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కూడా విపక్షాలు రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నాయని విమర్శించారు మోదీ. దేశంలోని భద్రత దళాలు, ప్రజలు సంక్షోభాల నుంచి బయటపడేందుకు పోరాడుతుంటే ..రాజకీయ శక్తులు మాత్రం ఇలాంటి పరిస్థితుల్ని మరింత జఠిలం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని కూడా విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. యోగా, ఆయుర్వేదంపై నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత సంచరించుకుంటే కుటుంబ పాలన సాగించే పార్టీలు మాత్రం వాటిని ప్రాచూర్యంలోకి రాకుండా అడ్డుపడాలని చూస్తున్నాయని కాంగ్రెస్, ఎస్పీని పరోక్షంగా విమర్శించారు.
విచ్చిన్నశక్తులను నమ్మకండి..
అంతే కాదు దేశీయ వస్తువుల వినియోగాన్ని తగ్గించి..విదేశీ వస్తువులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు భారత ప్రధాని మోదీ. ఒకప్పుడు పార్టీ గుర్తింపుగా ఉన్న ఖాదీని కాంగ్రెస్ నేతలు మర్చిపోయారని విమర్శించారు. స్వదేశీ వస్తువులపై ప్రచారం చేయడం, వాటిని ప్రోత్సహించడం వంటి వాటిని కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా చేశారా అంటూ మోదీ ప్రశ్నించారు. విపక్షాల లెక్కలు ఎలా ఉన్నా బీజేపీ అధికారం చేపడుతుందనే పూర్తి విశ్వాసం తమకు ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అంటే మార్చి 10 తర్వాత పేదలకు పక్కా ఇళ్లను అంజేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని మాటిచ్చారు మోదీ. పక్కా ఇళ్లే కాదు పేదలకు గ్యాస్ కనెక్షన్లు, ఉపాధి కల్పించే చర్యలను ముమ్మరం చేస్తామని చెప్పారు. చివరగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ మార్చి7న జరుగుతున్నందున ప్రధాని నరేంద్ర మోదీ తనదైన ప్రసంగంతో వారణాశి సభ నుంచే ఓటర్లను బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.