• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BJP WILL FORM NEXT GOVT IN BENGAL WITH FULL MAJORITY SAYS AMIT SHAH SK

Amit Shah on News18: బెంగాల్‌లో బీజేపీదే అధికారం.. అమిత్ షా ధీమా

Amit Shah on News18: బెంగాల్‌లో బీజేపీదే అధికారం.. అమిత్ షా ధీమా

న్యూస్ 18తో అమిత్ షా ఇంటర్వ్యూ

మమతా బెనర్జీతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన.. శ్రామిక్ రైళ్ల విషయంలో మమత రాజకీయం చేశారని విమర్శించారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పశ్చిమ బెంగాల్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్ని విభేదాలపై అమిత్ షా మాట్లాడారు. మమతా బెనర్జీతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన.. శ్రామిక్ రైళ్ల విషయంలో మమత రాజకీయం చేశారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి వస్తున్న బెంగాలీలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

    వెస్ట్ బెంగాల్ మాత్రమే అతి తక్కువ మంది వలస కార్మికులను రాష్ట్రంలోకి అనుమతిచ్చింది. ఇప్పటికే పల రైళ్లను రానీయడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి వెళ్లాలనుకున్న ఎంతో మంది బెంగాలీలను మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకున్నారు. వలస కార్మికులు తమ కుటుంబంతో ఉండేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు. అలాంటి వారిని అడ్డుకోవడం సమంజసం కాదు. శ్రామిక్ రైళ్లను కరోనా రైళ్లంటూ మమతా బెనర్జీ రాజకీయం చేశారు. ఆమెతో మాకు ఎలాంటి వివాదం లేదు.
    అమిత్ షా, కేంద్ర హో మంత్రి


    అంతకుముందు మోదీ 2.0 పాలనపై మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో 60 కోట్ల మంది జీవితాలు మారాయని అన్నారు. గత 60 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందుకోని ప్రజలకు మోదీ పాలనలో ఎంతో లబ్ధి చేకూరిందని తెలిపారు అమిత్ షా. దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన చెప్పారు. ఎన్డీయే పాలనలో రైతులు, మహిళలు, చిరువ్యాపారులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు