#AmitShahToNews18 : బీహార్‌లో నితీష్ నాయకత్వంలో పనిచేస్తాం.. : అమిత్ షా

నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఇంటర్వ్యూ గురువారం నెట్‌వర్క్ 18 టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతుంది.

news18-telugu
Updated: October 17, 2019, 8:27 AM IST
#AmitShahToNews18 : బీహార్‌లో నితీష్ నాయకత్వంలో పనిచేస్తాం.. : అమిత్ షా
అమిత్ షా
news18-telugu
Updated: October 17, 2019, 8:27 AM IST
బీజేపీ, జేడీయూ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేంద్రహోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టంచేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తుందని వెల్లడించారు అమిత్ షా. నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో బీజేపీ-జేడీయూ బంధానికి సంబంధించి పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేస్తాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ, జేడీయూ జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంలో పనిచేస్తాయి. రాష్ట్ర స్థాయిలో సీఎం నితీష్ నాయకత్వంలో పనిచేస్తాయి. కూటమిలో అభిప్రాయ బేధాలు ఉండడం సహజమే. ఐతే ఆ విభేదాల వల్ల మనసులు మారకుండా ఉండాలి.
అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


ప్రధాని మోదీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక కేంద్ర మంత్రి పదవుల విషయంలో జేడీయూ, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. జేడీయూకి ఒకే ఒక్క మంత్రి పదవి ఆఫర్ చేయడంతో నితీష్ దాన్ని తిరస్కరించారు. కేంద్రం తీరుపై అలకబూనిన ఆయన.. మోదీ కేబినెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు బీహార్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో మోదీపై ప్రతీకారం తీర్చుకున్నారు నితీష్. బీజేపీకి తక్కువ ప్రాధాన్యమిస్తూ జేడీయు ఎమ్మెల్యేలకు ఎక్కువ మంత్రి పదవులు కట్టబెట్టారు. దీనికి తోడు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ పార్టీకి ఇరు పార్టీల నేతలు హాజరు కాలేదు. దాంతో మిత్రపక్షాల మధ్య మరింత దూరం పెరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. ఐతే బీహార్‌లో కలిసే పోటీచేస్తామని ప్రకటించి ఆ ప్రచారానికి చెక్‌పెట్టారు అమిత్ షా.

నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఇంటర్వ్యూ గురువారం నెట్‌వర్క్ 18 టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతుంది.
First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...