BJP WANTS HIGH COURT TO TAKE COGNISANCE OF TALASANIS STATEMENT ON ENCOUNTER BA
దిశ నిందితుల ఎన్కౌంటర్... మంత్రి తలసానికి కొత్త తలనొప్పి...
మంత్రి తలసాని యాదవ్
ఎన్కౌంటర్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందంటూ బీజేపీ నేత కృష్ణసాగర్రావు ఆరోపించారు. తలసాని వ్యాఖ్యల మీద హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎన్కౌంటర్ ఘటనపై స్పందించిన తలసారి శ్రీనివాస్ యాదవ్.. ఇది కేసీఆర్ ఉగ్రరూపం అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్కౌంటర్ దేశానికే మార్గదర్శకమని తలసాని అన్నారు. నిర్భయ నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మౌనాన్ని చాలామంది తక్కువగా అంచనా వేశారని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని... కేసీఆర్ని జాతీయ నేతలు సైతం ప్రశంసిస్తున్నారని తలసాని వ్యాఖ్యానించారు. అయితే, తలసాని వ్యాఖ్యలను బీజేపీ తప్పుపడుతోంది. ఎన్కౌంటర్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందంటూ బీజేపీ నేత కృష్ణసాగర్రావు ఆరోపించారు. ఎన్కౌంటర్కు సంబంధించి తాము సైబరాబాద్ సీపీ చెప్పిన దాన్ని స్వాగతిస్తున్నామన్న బీజేపీ నేత... అయితే, ఇందులోనూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరికాదని మండిపడ్డారు. తలసాని వ్యాఖ్యల మీద హైకోర్టు జోక్యం చేసుకోవాలని కృష్ణసాగర్ రావు కోరారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.