రసవత్తరంగా ఏపీ రాజకీయం.. దూరం పెడుతున్న బీజేపీ.. దగ్గర కొస్తున్న వైసీపీ..

AP Politics: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు. మొదట్లో ఇదేదో కావాలని చేసినట్లు అనుకున్నా.. ఇప్పుడు ఆ పరిధి దాటి విరోధులుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సీఎం జగన్‌పై చేసిన ఏపీ బీజేపీ విమర్శలే.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 5:36 PM IST
రసవత్తరంగా ఏపీ రాజకీయం.. దూరం పెడుతున్న బీజేపీ.. దగ్గర కొస్తున్న వైసీపీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు అంటే.. ఒకటి అధికార వైసీపీ కాగా, మరొకటి టీడీపీ. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో టీడీపీ ఒక్కసారిగా డీలా పడింది. ఆ పార్టీ ప్రముఖ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే సుజనా చౌదరి లాంటి నేతలు కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అలా.. చాలా మంది బీజేపీలో చేరుతుండటంతో ఆ పార్టీ వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా తయారవుతోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ స్నేహపూర్వకంగానే మెలిగాయి. కానీ.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు. మొదట్లో ఇదేదో కావాలని చేసినట్లు అనుకున్నా.. ఇప్పుడు ఆ పరిధి దాటి విరోధులుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సీఎం జగన్‌పై చేసిన ఏపీ బీజేపీ విమర్శలే. ఆ పార్టీ ట్విట్టర్ వేదికగా.. ప్రవాసాంధ్రుల సభలో జగన్ జ్యోతి ప్రజ్వలన చేయలేదని, అది హిందువులను మోసం చేయడమేనంటూ పోస్టు పెట్టింది.

అయితే, ఆ ట్వీట్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దీటుగా సమాధానం ఇచ్చారు. జగన్ హిందూ వ్యతిరేకి అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని వ్యాఖ్యానించారు. ఈ రకమైన ప్రచారం చేస్తున్న బీజేపీ తీరును ఆయన తప్పుబట్టారు. అమెరికాలో పద్ధతులు తెలుసుకోకుండా మాట్లాడటం మంచిది కాదన్నారు. సూచించారు. అక్కడ ఫైర్ సెఫ్టీ విధానాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ ఎలక్ట్రిక్ పద్ధతిలో జ్యోతిని వెలిగించారని, ఈ విషయం తెలియకుండా బీజేపీ విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందేమోనని అనుకుంటున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జగన్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను సంప్రదించే తీసుకుంటారని విజయసాయిరెడ్డి చెప్పారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏ అంశాల్లోనూ ప్రధాని మోదీతో మాట్లాడాకే జగన్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలేమీ లేవని చెప్పినట్లైంది. అయితే, ఈ రోజు జరిగిన రెండు సందర్భాలను బట్టి చూస్తే వైసీపీని బీజేపీ దూరం పెడుతున్నట్లు, వైసీపీనే బీజేపీకి దగ్గరవుతున్నట్లు అవగతం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>