ఢిల్లీలో బీజేపీకి ఊరట కలిగించే విషయం అదొక్కటే

ఢిల్లీలో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీజేపీకి ఊరట కలిగించే విషయం ఒకటి ఉంది.

news18-telugu
Updated: February 12, 2020, 2:28 PM IST
ఢిల్లీలో బీజేపీకి ఊరట కలిగించే విషయం అదొక్కటే
అమిత్ షా, నరేంద్ర మోదీ
  • Share this:
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ పరాజయాన్ని చవిచూసిన బీజేపీ... ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో నిమగ్నమైంది. హస్తినలో పాగా వేసేందుకు కమలదళం ఎంతగానో ప్రయత్నించినా... కేజ్రీవాల్ క్రేజ్ ముందు బీజేపీ వ్యూహాలేవీ ఫలించలేదు. మొత్తం 70 స్థానాల్లో ఆప్ 62 స్థానాలు గెలుచుకోగా... బీజేపీ అతి కష్టం మీద 8 స్థానాల్లో పాగా వేయగలిగింది. అయితే బీజేపీకి ఇంత కష్టకాలంలోనూ ఊరట కలిగించే విషయం ఒకటి ఉంది. అదే ఢిల్లీలో ఆ పార్టీకి ఓటు బ్యాంకు శాతం పెరగడం. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లకు పరిమితమైన బీజేపీ... అప్పట్లో 32.19 శాతం ఓట్లను సాధించింది.

అయితే ఈసారి అందుకు అదనంగా 38.51 శాతం ఓట్లను బీజేపీ సాధించింది. సీట్ల పరంగా బీజేపీ నమోదు చేసిన పెరుగుదల స్వల్పమే అయినా... ఓట్లపరంగా మాత్రం బీజేపీ కొంత మంచి ప్రదర్శన కనబరిచిందనే చెప్పాలి. ఇక గత ఎన్నికల్లో 54.35 శాతం ఓట్లను సాధించిన ఆప్... ఈసారి 53.57శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఢిల్లీలోని బురారీ నియోజకవర్గానికి చెందిన ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ ఝా తన ప్రత్యర్థిపై 88,158 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించగా... బిజ్వాసన్ నియోజకవర్గానికి చెందిన ఆప్ అభ్యర్థి భూపిందర్ సింగ్ బీజేపీ అభ్యర్థి ప్రకాశ్ రానాపై 753 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు