ఏపీ, తెలంగాణ రాజకీయాలపై ... విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్

ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను ముంచడమే వైఎస్ఆర్ ప్రభుత్వానికి పనిగా మారింది.

మా ఇంటికొస్తే ఏం తెస్తావ్ మీ ఇంటికొస్తే ఏమిస్తావ్ అనేవిదంగా ఉంది ...విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్

 • Share this:
  అనంతపురం తాడిపత్రి : విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ ప్రాజెక్టులకు విషయంలో రాష్ట్రప్రభుత్వంవైఖరిపై అనుమానించాల్సవస్తుంది. కాలేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపనకు తెలంగాణకు పోయిన జగన్ గారికి ఆప్రాజక్ట్ గురించి నేడు ఫిర్యాదు చేసే అర్హత ఉందా? అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జగన్ మరియు కేసిఆర్ గారు హాట్ లైన్ లో మాట్లాడుకుంటారు ఆన్లైన్లో తిట్టుకున్నట్లు ప్రజలముందు నటిస్తున్నారు. జగన్ మరియు కేసిఆర్ గారు నీటి వివాదం పేరుతో రెండు రాష్ట్రలలో కోత్త రాజకీయ డ్రామాకు తెరలేపారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులకు మద్దతుఇవ్వకపోతే చంద్రబాబు మీరు చరిత్రలో సీమ ద్రోహిగా నిలిచిపోతారు అన్నారు. బాబు మీ పార్టీ వైఖరి రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో ఎందు ఇంతవరకు ప్రకటించలేదు? రాయలసీమ ప్రాజెక్టులవిషయంలో రాష్ట్రంలో పార్టీల వైఖరి ప్రకటించండి. తెలంగాణ నేతలను పార్టీలనుచూసి కనీసం సిగ్గుతెచ్చుకోండి అన్నారు. విద్యుత్ బిల్లులు మేము అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రజల ఓట్లు వేయించుకొని నేడు మోసంచేస్తున్నావు.
  ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేకదా? ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను ముంచడమే వైఎస్ఆర్ ప్రభుత్వానికి పనిగా మారింది. పేదల విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అలోచన...మా ఇంటికొస్తే ఏం తెస్తావ్ మీ ఇంటికొస్తే ఏమిస్తావ్ అనేవిదంగా ఉంది అని అన్నారు. విద్యుత్ బిల్లలకు సంబంధించి గత ప్రభుత్వానికి పోటీపడి వైఎస్ఆర్సిపి పేద ప్రజల నుంచి ముక్కుపిండి అధిక ధరలు వసూలు చేస్తుంది. ప్రజలకు నవరత్నాల ద్వార డబ్బులు ఇస్తున్నానని ఓకవైపు వేసి ...
  మరో వైపు అదికారులును పంపి విద్యుత్ ,మద్యం ద్వార డబ్బులను ప్రభుత్వ లాక్కంటుంది అని విమర్శించారు.
  Published by:Venu Gopal
  First published: