Home /News /politics /

Dharani : రెవెన్యూ వ్యవస్థపై రాములమ్మ బాంబు -విదేశీ హస్తం, డేటా లీకేజ్? -ఏం జరుగుతోంది?

Dharani : రెవెన్యూ వ్యవస్థపై రాములమ్మ బాంబు -విదేశీ హస్తం, డేటా లీకేజ్? -ఏం జరుగుతోంది?

ధరణి పోర్టల్ పై విజయశాంతి అనుమానాలు

ధరణి పోర్టల్ పై విజయశాంతి అనుమానాలు

రెవెన్యూ వ్యవస్థలో సంచలన ప్రక్షాళనగా టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర స్థాయి అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాల భూరికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల వివరాలు విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయంటూ రాములమ్మ బాంబు పేల్చారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి కేసీఆర్ సర్కారుపై అనూహ్య ఆరోపణలు చేశారు. రెవెన్యూ వ్యవస్థలో సంచలన ప్రక్షాళనగా టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై ఆమె తీవ్ర స్థాయి అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాల భూరికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల వివరాలు విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయంటూ రాములమ్మ బాంబు పేల్చారు. భూములకు సంబంధించి తెలంగాణలో జరుగుతోన్న కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అంశాలవారీగా సీఎం కేసీఆర్ పై, అధికార టీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తోన్న విజయశాంతి ఈసారి మాత్రం అనూహ్య అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ మేరకు చేసిన ప్రకటనలో విజయశాంతి ఏమన్నారో ఆమె మాటల్లోనే..

‘రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంటూ తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోని లోపాలతో రాష్ట్రంలోని ప్రజలు.. ముఖ్యంగా రైతులు ఇప్పటికే గుండెలు బాదుకుంటున్నరు. ఇప్పుడు అంతకంటే షాకిచ్చే మరి కొన్ని అంశాలు మీడియా కథనం ద్వారా తాజాగా బయటకొచ్చి రాష్ట్ర సర్కారు దివాలాకోరు పనితీరును బయటపెట్టాయి. అదేమిటంటే... తెలంగాణ రైతుల భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ మొత్తాన్నీ దివాళా బాటపట్టిన టెర్రాసిస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ చేతుల్లో కేసీఆర్ సర్కారు పెట్టింది.

etela rajenderకు చెక్ పెడుతున్నారా? -తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటనలో అర్థం ఇదేనా?



ఈ టెర్రాసిస్ గతంలో బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్న ఐఎల్ఎఫ్ఎస్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు టెర్రాసిస్‌లో సగానికి పైగా వాటాను ఫిలిప్పీన్స్‌‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్‌‌నకు ఐఎల్ఎఫ్ఎస్ అమ్మేసింది. ఆ విధంగా మన తెలంగాణ భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లినట్లయింది. దాదాపు 70 లక్షల మంది రైతులకు చెందిన సుమారు కోటిన్నర ఎకరాల భూముల రికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల సమాచారం ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీకి చేతిలో పడి ఆ భూముల డేటా భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..



ధరణి పోర్టల్ డేటాపై సైబర్ దాడులు జరిగి హ్యాక్ అయితే పరిస్థితి ఏమిటి? ఏవైనా సమస్యలు తలెత్తితే, అప్పుడు ఏకైక ఆధారమైన మాన్యువల్ రికార్డులను పరిరక్షించే చర్యల్ని కూడా సర్కారు చేపట్టడం లేదు. తెలంగాణలో ప్రజల ఆస్తులైన సర్కారు భూములు, రైతుల భూముల డేటా భద్రత విషయంలో ఇంత దారుణమైన నిర్లక్ష్యాన్ని తెలంగాణ సర్కారు ప్రదర్శిస్తోంది. పైగా ఇందుకు సంబంధించిన సమాచారం అడిగిన సమాచార కార్యకర్తలకు సైతం సరైన జవాబు ఇచ్చే దిక్కు లేదు. భూముల ప్రక్షాళన పేరిట రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న ఈ సర్కారును నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది’అని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీ నేత ఆరోపణలపై అధికార టీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Dharani Portal, Telangana, Vijayashanthi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు