జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కీలక ప్రకటన చేశారు. మోదీ సర్కారు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన.. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో ముందడుగు అని అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి అని చెప్పారు. ఈ అధికరణను రద్దు చేయాలన్న ప్రతిపాదన జనసంఘ్ రోజుల నుంచే ఉండేదని వెల్లడించారు. ఎట్టకేలకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అద్వానీ అభినందనలు తెలిపారు.
జమ్మూకశ్మీర్, లదాఖ్‌లో శాంతి వెల్లివిరిస్తుందని, అక్కడి ప్రజల శాంతి, సుఖ సంతోషాల దిశగా ఇదో చరిత్రాత్మక నిర్ణయమని అద్వానీ వ్యాఖ్యానించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:August 05, 2019, 18:01 IST