BJP UTTARAKHAND LIST OUT 10 SITTING MLAS DROPPED PVN
Uttarakhand Election : బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్..10మంది సిట్టింగ్ లకు షాక్
ప్రతీకాత్మక చిత్రం
BJP Candidates List : అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ లో కూడా ఒకటి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా 59 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌లో రెండోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టింది. ఉత్తరాఖండ్ లో బీజేపీ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చడం.. పెద్ద ఎత్తున సిట్టింగులను పక్కన పెట్టడం వంటి అంశాలు ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.
Uttarakhand BJP : ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనుభారతీయ జనతా పార్టీ(BJP)చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.ఈ ఎన్నికల్లో మెరుగైన విజయాలు సాధించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమకు తిరుగు లేదని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడటం లేదు బీజేపీ. గెలిచే అవకాశం లేని వారిని.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని నిర్మొహమాటంగా పక్కనపెడుతోంది.
కాగా,అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ లో కూడా ఒకటి. ఉత్తరాఖండ్ లో గతేడాది జరిగిన కొన్ని కీలక పరిణామాల అనంతరం బీజేపీ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. గతేడాది ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీ ముగ్గురు సీఎంలను మార్చింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి కొనసాగుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా 59 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 70 స్థానాలకు గాను.. 59 అభ్యర్థుల జాబితాను ఉత్తరాఖండ్ బీజేపీ వ్యవహారాల బాధ్యుడు ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు. ప్రకటించిన 59 మంది అభ్యర్థుల్లో 31 మంది గ్రాడ్యుయేట్లు, 18 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 10 శాతానికి పైగా మహిళలు ఉన్నారు.
తాజాగా విడుదల చేసిన జాబితాతో 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఉత్తరాఖండ్‌లో రెండోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ..మహిళా విభాగం అధ్యక్షురాలు రీతూ ఖండూరి భూషణ్‌తో సహా 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టింది. పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు. జాబితా నుండి తొలగించబడిన 10 మంది శాసనసభ్యులలో కొందరికి వారి కుటుంబ సభ్యులకు ఎన్నికల టిక్కెట్లు ఇవ్వడంతో శాంతించారు.
ఇక,ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితోపాటు 11 మంది మంత్రులు, ఉత్తరాఖండ్ భాజపా అధ్యక్షుడు మదన్ కౌషిక్‌కు.. ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలే కేటాయించారు. త్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి ఖతియా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ కు వరుసగా హరిద్వార్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు చోటు కల్పించారు. రాష్ట్ర పార్టీ యూనిట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచిన ఈ జాబితాలో.. బాలీవుడ్ గాయకుడు జుబిన్ నౌటియాల్ తండ్రి అయిన రామ్‌శరణ్ నౌటియాల్ పేరు కూడా ఉంది. 2014లో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు రామ్‌శరణ్ నౌటియాల్. అతను కాంగ్రెస్ దిగ్గజ నేత ప్రీతమ్‌తో పోటీ పడుతున్నాడు. త్వరలోనే మిగతా 11స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇక, ఉత్తరాఖండ్ లో బీజేపీ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చడం.. పెద్ద ఎత్తున సిట్టింగులను పక్కన పెట్టడం వంటి అంశాలు ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.
కాగా. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీ గత వారం తొలి దశ జాబితా విడుదల చేసింది. 107మందితో కూడిన జాబితాలో 20 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.