Home /News /politics /

BJP UP CHIEFS SEXIST JOKE ON MAYAWATI AKHILESH AND MULAYAM OVER 1995 GUEST HOUSE INCIDENT RAISES A STORM MS

మాయావతిపై నోరు పారేసుకున్న మరో బీజేపీ నేత.. ఈసారి మరీ దారుణంగా..

అఖిలేశ్, మాయావతి(File)

అఖిలేశ్, మాయావతి(File)

బీజేపీ నేత సాధనా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మరిచిపోకముందే మరో బీజేపీ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మహేంద్రనాథ్ పాండే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు.. అదే వేదికపై కేంద్రమంత్రులు జేపీ నడ్డా, మనోజ్ సిన్హా కూడా ఉన్నారు.

    ఎస్పీ-బీఎస్పీ పొత్తును ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ మహేంద్ర నాథ్ పాండే ఓ అభ్యంతరకర జోక్ వేశారు. 1995 లక్నో గెస్ట్ హౌజ్‌లో ఎస్పీ శ్రేణుల చేత మాయావతికి ఎదురైన అవమానాన్ని గుర్తుచేస్తూ మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాయావతి పుట్టినరోజు సందర్భంగా అఖిలేశ్ ఆమెకు శాలువా కప్పుతూ చెవిలో ఓ గుసగుస చెప్పారని అన్నారు.

    ఇంతకీ ఏంటా గుసగుస అంటే.. 'ఈ శాలువా అప్పట్లో లక్నో గెస్ట్ హౌజ్‌లో పితాజీ ములాయం సింగ్ మీ నుంచి లాగేసిందే..' అని అఖిలేశ్ మాయావతి చెవిలో చెప్పినట్టుగా మహేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. అందుకు మాయావతి 'ఛల్.. చిలిపీ..' అంటూ అఖిలేశ్‌కు బదులిచ్చినట్టుగా తెలిపారు. మాయావతి ఆడనా..? మగనా? అంటూ బీజేపీ నేత సాధనా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మరిచిపోకముందే మరో బీజేపీ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మహేంద్రనాథ్ పాండే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు.. అదే వేదికపై కేంద్రమంత్రులు జేపీ నడ్డా, మనోజ్ సిన్హా కూడా ఉన్నారు.

    కాగా, ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రకటించిన రోజే.. ఎస్పీ శ్రేణులు తనతో సమానంగా మాయావతిని గౌరవించాలని అఖిలేశ్ యాదవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో యూపీలో ఈసారి బీజేపీకి టఫ్ ఫైట్ తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

    ఇది కూడా చదవండి : మాయావతి ఆడా? మగా? అన్న బీజేపీ ఎమ్మెల్యే....మహిళా కమిషన్ నోటీసులు
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Bjp, Lok Sabha Election 2019, Mayawati, Sp-bsp, Uttar pradesh, Uttar Pradesh Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు