బీజేపీ భారీ స్కెచ్... తెలంగాణపై ‘దండు’యాత్ర

తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టే ప్రచార వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయి నేతలతో భారీ షెడ్యూల్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.

news18-telugu
Updated: November 24, 2018, 8:58 PM IST
బీజేపీ భారీ స్కెచ్... తెలంగాణపై ‘దండు’యాత్ర
బీజేపీ ప్రముఖ నేతలు (ఫైల్ ఫొటోలు)
  • Share this:
తెలంగాణలో సత్తాచాటేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ప్రచారానికి జాతీయస్థాయి నేతలను రంగంలోకి దింపుతోంది. దాదాపు 50 బహిరంగసభలను ప్లాన్ చేసింది. ఆదివారం జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మొదలు కానున్న అగ్రనేతల ప్రచార పర్వం.. ఆఖరు వరకు కొనసాగనుంది.

ఇప్పటికే తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీ నుంచి అగ్రనేతలందరినీ రంగంలోకి దిప్పింది. ట్రబుల్ షూటర్లుగా పేరున్న ఏఐసీసీ లీడర్లను హైదరాబాద్‌లో మోహరించింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది. ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వరుస సభలతో దూకుడు మీదుండగా..  కేటీఆర్, హరీశ్‌రావ్, కవితలు సైతం ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు.

కాంగ్రస్‌కు ధీటుగా అగ్రనేతలను రంగంలో దింపుతోంది బీజేపీ. మోదీ, అమిత్‌షాలకు తోడు మరికొందరు జాతీయ స్థాయి నేతలను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దింపుతోంది. అందుకు తగ్గట్టుగా 50 భారీ సభలను ఏర్పాటు చేసింది.

ప్రధాని మోదీ మూడు సభల్లో, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 10 బహిరంగసభలు, రెండు రోడ్ షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్దమైంది. వీరికి తోడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 8 బహిరంగసభల్లో, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 11 బహిరంగసభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసింది బీజేపీ. అంతేకాదు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ నాలుగు సభల్లోనూ, సుష్మాస్వరాజ్ ఒక సభలో, మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి మూడు సభల్లోనూ పాల్గొనేలా ప్రచారషెడ్యూల్ ఖరారైంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఇలా.. మొత్తంగా 50 బహిరంగసభలను ప్లాన్ చేసింది బీజేపీ.

మునుపెన్నడూ లేనంతగా తెలంగాణలో పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలో దింపిన బీజేపీ.. ప్రచారాన్ని కూడా అదే రేంజ్‌లో సాగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్వామి పరిపూర్ణానందను స్టార్ క్యాంపెయినర్‌గా ముందుంచి.. ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. దీనికి తోడు అగ్రనేతలనూ రంగంలోకి దింపడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతోంది. కమలం పార్టీ ఏమేర ఫలితాలు సాధిస్తుందో చూడాలి.
Published by: Santhosh Kumar Pyata
First published: November 24, 2018, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading