టీఆర్ఎస్‌ బలంపై గురి పెట్టిన బీజేపీ... సరికొత్త వ్యూహం ?

ఉత్తర తెలంగాణలో బలపడాలంటే ముందుగా సింగరేటి కార్మిక సంఘాలు, ఆయా ప్రాంతాల్లో బలం పుంజుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

news18-telugu
Updated: September 30, 2019, 7:07 PM IST
టీఆర్ఎస్‌ బలంపై గురి పెట్టిన బీజేపీ... సరికొత్త వ్యూహం ?
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
తెలంగాణలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బీజేపీ... అందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ వ్యాప్తంగా బలం పుంజుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ... ఈ క్రమంలో టీఆర్ఎస్‌కు ఆయువుపట్టువు లాంటి కోల్ బెల్ట్ ప్రాంతంపై కన్నేసినట్టు తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ లోక్ సభ సీట్లను గెలుచుకున్న బీజేపీ... తాము బలంగా దృష్టి పెడితే ఉత్తర తెలంగాణలో బలపడే అవకాశం ఉందనే భావనలో ఉంది.

ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణలో బలపడాలంటే ముందుగా సింగరేటి కార్మిక సంఘాలు, ఆయా ప్రాంతాల్లో బలం పుంజుకోవాలని నిర్ధారణకు వచ్చింది. దీంతో సింగరేణి కార్మిక సంఘాల నాయకులను ఇప్పటికే తమ పార్టీలోకి ఆహ్వానించి తమ పార్టీ కార్మిక సంఘం ద్వారా ఎన్నికల్లో పోటీ చేయించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొందరు కార్మిక సంఘాలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సింగరేణి ప్రాంతంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కేంద్రమంత్రి సదానందగౌడ రామగుండంలో పర్యటించడం... ఆ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడం ఇందులో భాగమే అనే టాక్ వినిపిస్తోంది.

Singareni region, singareni coal belt, bjp foucs on singareni, bjp vs trs, bjp vs trs in singareni, cm kcr, trs, kishan reddy, bjp, telangana latest news, సింగరేణి ప్రాంతం, కోల్ బెల్ట్ ప్రాంతం, సింగరేణిపై బీజేపీ ఫోకస్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, కేసీఆర్, కిషన్ రెడ్డి, బీజేపీ, తెలంగాణ న్యూస్
కేసీఆర్, అమిత్ షా(ఫైల్ ఫోటో)


ఇదిలా ఉంటే తాజాగా కోల్ బెల్ట్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రంగంలోకి దించిందని తెలుస్తోంది. సింగరేణి కార్మికులను చేరువకావడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ... ఈ ప్రాంతంలో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టగలిగితే టీఆర్ఎస్‌ కోలుకోలేని విధంగా నష్టపోతుందనే యోచనలో ఉంది. మొత్తానికి సింగరేణి ప్రాంతంలో బలపడాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
First published: September 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>