BJP TO GIVE FREE LPG GAS CYLINDER ON HOLI AND DIWALI EVERY YEAR IF VOTED TO POWER IN UP SAYS RAJNATH SINGH MKS
Free LPG Cylinder: బంపర్ ఆఫర్.. అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు: ఇలా చేస్తేనే!!
ప్రతీకాత్మక చిత్రం
ఇక నుంచి ప్రజలకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామన్నారు. అది కూడా హోలీ, దీపావళి పండుగలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఈ బంపర్ ఆఫర్ కేవలం ఉత్తరప్రదేశ్ వాసులకే సొంతం కానుంది. దానికి కూడా ఓ భారీ కండిషన్లున్నాయి.
పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలతోపాటు ఎల్పీజీ సిలిండర్ ధరలు చుక్కల్లో దాక్కొన్న వేళ.. కేంద్రం పెద్దలు వరుసగా కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇక నుంచి ప్రజలకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామన్నారు. అది కూడా హోలీ, దీపావళి పండుగలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఈ బంపర్ ఆఫర్ కేవలం ఉత్తరప్రదేశ్ వాసులకే సొంతం కానుంది. దానికి కూడా ఓ భారీ కండిషన్లున్నాయి. ప్రధాని మోదీ కేబినెట్ లో టాప్ మంత్రుల్లో ఒకరైన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం నాడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపై అమిత్ షా కూడా రెండ్రోజుల కిందట హామీ ఇచ్చారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం హిందూ పండుగలకు మరో బంపరాఫర్ ప్రకటించారు. వివరాలివే..
ఎన్నికల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో హామీల వరద ఏరులై పారుతోంది. రెండు విడతల పోలింగ్ ముగిసి, మంగళవారం మూడో విడత పోలింగ్ జరుగనుండగా ఉచిత పథకాల ప్రకటనలు జోరుగా సాగుతున్నాయి. శనివారం యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఓటర్లకు కీలక హామీ ఇచ్చారు. బీజేపీకి ఓటేస్తే హోలీ, దీపావళి పండుగలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని మాటిచ్చారు. గోండా జిల్లా కొలోనెల్ గంజ్ అసెంబ్లీ నియోజవవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయనీ వాగ్ధానం చేశారు. నిజానికి ఈ హామీని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చిది.
చైనాతో సరిహద్దు వివాదాలు, డ్రాగన్ దేశంతో పాకిస్తాన్ దోస్తీ అంశాలపై పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సైతం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ యూపీ ఎన్నికల ప్రచారంలో బదులిచ్చారు. ‘రాహుల్ గాంధీకి ప్రాచీన భారత చరిత్రే కాదు, కనీసం ఆధునిక భారత చరిత్ర కూడా తెలీదు. పాకిస్తాన్ ఆక్రమించిన షక్స్‌గామ్ లోయ భూభాగాన్ని చైనాకు అప్పగించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కారకోరం హైవే నిర్మించినప్పుడు ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. చైనా రోడ్, రైల్ బెల్ట్ CPEC నిర్మాణం ప్రారంభమైనప్పుడు భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారేగానీ మోదీ కాదని రాహుల్ కు తెలీదా? అయినా మోదీ సారధ్యంలోని భారత్ ఇప్పుడు బలహీన దేశం కాదు. బలమైన దేశంగా ఆవిర్భవించింది. ఇవాళ భారత్ చెప్పే ప్రతి మాటను ప్రపంచం శ్రద్ధగా వింటోంది’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
If voted to power in UP again, BJP Govt will provide free LPG gas cylinder on the ocassion of Holi and Diwali every year: Defence Minister Rajnath Singh in Colonelganj, Gonda pic.twitter.com/B5xcZILkXh
ఫిలిబిత్ లో జరిగిన మరో ఎన్నికల ప్రచార సభలో యూపీ సీఎం, ప్రస్తుత ఎన్నికల్లోనూ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ మతాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో సమాజ్ వాదీ, ఇతర పార్టీల ప్రభుత్వాలు కులమతాల ఆధారంగా కరెంటు సరఫరా చేసేవి. ముస్లిల ఈద్, మొహర్రం పండుగలకు కరెంటు ఇచ్చేవాళ్లు కానీ హోలీ, దీపావళి లాంటి పండుగలకు కరెంటు ఇవ్వలేదు’ అని యోగి ఆరోపించారు. అయోధ్యలో రామ్‌లల్లా భూమిని ఎవరూ స్వాధీనం చేసుకోలేదని, గతంలో కబ్జాకు గురైన భూమి బీజేపీ హయాంలో విముక్తి పొందిందని యోగి గుర్తుచేశారు. యూపీలో మూడో విడత పోలింగ్ ఆదివారం (ఫిబ్రవరి 20)న జరుగనుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.