హర్యానాలో బీజేపీ - జేజేపీ మధ్య కుదిరిన ఒప్పందం..

హర్యానాలో బీజేపీ, జేజేపీ మధ్య ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి.

news18-telugu
Updated: October 25, 2019, 10:12 PM IST
హర్యానాలో బీజేపీ - జేజేపీ మధ్య కుదిరిన ఒప్పందం..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ చౌతాలా (Image:ANI)
  • Share this:
హర్యానాలో బీజేపీ, జేజేపీ మధ్య ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. కేంద్ర హోమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో.. జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ చౌతాలా సమావేశం అయిన తర్వాత రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు పార్టీల మధ్య కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం.. దుష్యంత్ సింగ్‌ పార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి ప్రభుత్వాన్ని నడిపించనున్నారు.

హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు, దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్ జనతా పార్టీకి 10 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు, ఇతరులు ఎక్కువ సీట్లు గెలిచాయి. తాము బీజేపీకి మద్దతిస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు. వారి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. అయితే, ఇండిపెండెంట్ల కంటే ఒకే పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మొగ్గుచూపింది.

బీజేపీ - జేజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై రేపు గవర్నర్‌ను కలుస్తామని మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ - జేజేపీ కలసి నడవాలని నిర్ణయించుకున్నట్టు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ తెలిపారు.

First published: October 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>