బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష నేడే..

రైతులకు మద్దతుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేయనున్నట్టు బండి సంజయ్ తెలిపారు.

news18-telugu
Updated: April 24, 2020, 6:17 AM IST
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష నేడే..
బండి సంజయ్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులకు మద్దతుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేయనున్నట్టు ఆయన చెప్పిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వానికి ప్రజలు, రైతులు సహకరిస్తున్నా.. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేసుకోవడం.. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఐకేపీ సెంటర్లలోనే ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన ఆయన.. శుక్రవారం చేపట్టే ఉపవాసదీక్షలో రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా, మండల అధ్యక్షులు ఎవరి ఇంట్లో వారు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 24, 2020, 6:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading