BJP TELANGANA PRESIDENT BANDI SANJAY HAS CLEARED ABOUT CENTRAL FUNDS VRY NZB
Bandi sanjay : కేంద్ర నిధులపై బండి సంజయ్ క్లారిటీ... కేటీఆర్ రాజీనామా చేయలని డిమాండ్.. !
బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
Bandi sanjay : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటి ఇచ్చారు. కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన మండి పడ్డారు.ఏడు సంవత్సరాల్తో కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా,
న్యూస్18తెలుగు ప్రతినిధిః పి మహేందర్,
కేంద్రం ఇస్తున్న నిధులపై (TRS)టీఆర్ఎస్ ,(BJP) బీజేపీ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా మంత్రి కేటీఆర్(ktr) బీజేపీ ఎంపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు (Bandi sanjay)కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలో సవాల్ విసిరారు. కేంద్రం గత ఏడు సంవత్సరాల్లో రాష్ట్రం నుండి రెండు లక్షల యాబై వేల కోట్ల రూపాయలకు పైగా పన్నుల రూపంలో ఇస్తే తిరిగి రాష్ట్రానికి ఇచ్చింది కేవలం లక్ష నలబై రెండు వేల కోట్లు మాత్రమేనంటూ ధ్వజమెత్తారు. దీంతో ఇంతకంటే కేంద్రం ఒక్కరూపాయి రాష్ట్రానికి ఇచ్చినట్టు బండి సంజయ్ నిరూపిస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేదంటే బండి సంజయ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్(Demand) చేశారు.
అయితే మంత్రి కేటీఆర్ సవాల్‌కు బండి సంజయ్ ముందుగా నేరుగా స్పందించలేక పోయాడు. కేంద్రం ఇస్తున్న నిధులపై ఏకంగా ప్రధానమంత్రి వద్ద చర్చిద్దామని సవాల్ విసిరారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ నిధుల విషయంలో ముందుకు వస్తే సవాల్‌ను స్వీకరిస్తానని అన్నారు.
అయితే తాజాగా కేంద్రం ఇస్తున్న నిధులపై స్పష్టత ఇచ్చారు. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌కు వివరణ ఇచ్చారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వస్తున్న నిధుల వివరాలు ఆయన వెల్లడించారు.
ఈ క్రమంలోనే గత ఏడేళ్లలో పన్నుల వాటా, ప్రాయోజిత పథకాలు, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే, ఫ్రీ వ్యాక్సిన్ పేరిట ఇప్పటి వరకు రూ.2 లక్షల 52 వేల కోట్లు తెలంగాణకు చెల్లించిందన్నారు. ఇవి కేవలం ఐదు అంశాల్లో మాత్రమేనని, దేశ రక్షణ, విమానాయాన, శాటిలైట్ నిర్వహణ, జాతీయ విపత్తు వంటి అంశాల్లో కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సవాల్ విసిరిన మంత్రి కేటిఆర్‌కు ఏ మాత్రం సిగ్గున్నా రాజీనామా చేసి తీరాలని ప్రతి సవాల్ విసిరారు.ముఖ్యమంత్రి కేసీఆర్.... (cm kcr) ఈ విషయంపై మాట్లాడితే లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) వద్దకు కేసీఆర్ తో వెళ్లి వాస్తవాలు తెలిపేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు.మరోవైపు కేంద్రం వివక్ష చూపుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.ఇవే అంశాలను పార్లమెంట్ (parlament)సాక్షిగా ప్రశ్నిస్తే రాష్ట్ర నేతల బండారం బయటపడుతుందని బండి సంజయ్ అన్నారు.
అయితే మంత్రి కేటీఆర్ మాత్రం గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లిస్తే... కేంద్రం రూ.1.46 లక్షల కోట్లు మాత్రమే చెల్లిస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆయన ఆరోపణలు చేశారు... ఇది తప్పయితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.