బీజేపీపై విమర్శలు... కేటీఆర్ ఇరుక్కుపోయారా ?

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాపై చేసిన విమర్శలు కేటీఆర్‌కు కొంత ఇబ్బందిగా మారినట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: August 21, 2019, 4:25 PM IST
బీజేపీపై విమర్శలు... కేటీఆర్ ఇరుక్కుపోయారా ?
కేటీఆర్ (File)
  • Share this:
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే విషయంలో తండ్రి కేసీఆర్‌కు ఏ మాత్రం తీసిపోనని అనేకసార్లు ప్రూవ్ చేసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా... ఇతర పార్టీలపై కేటీఆర్ మాటల దాడి కొనసాగింది. అయితే తాజాగా బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు కొంత ఇబ్బంది కలిగించేలా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. జేపీ నడ్డాపై కేటీఆర్ ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ... ఆయనకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ జేపీ నడ్డా చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన ఎవరో తెలియదని కామెంట్ చేశారు కేటీఆర్. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందనే విమర్శలతో పాటు జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని కేటీఆర్ కామెంట్ చేయడంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కవితను బీజేపీ ఓడించిందనే విషయాన్ని కొందరు చేస్తుంటే... గతంలో జేపీ నడ్డా మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఆయనను కలిశారనే విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఈ రకంగా కేటీఆర్‌పై రాజకీయ దాడి చేస్తూ... ఆయనకు అహంకారం ఎక్కువైందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాపై చేసిన విమర్శలు కేటీఆర్‌కు కొంత ఇబ్బందిగా మారినట్టు కనిపిస్తోంది.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు