బీజేపీ ఎటాక్‌పై వైసీపీ సైలెన్స్... జగన్ వ్యూహం ఏంటి ?

ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతలు...అప్పుడే వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ నేతలు కనీసం మూడు నెలల సమయం కూడా ఇవ్వడం లేదని వారి మాటలను బట్టి అర్థమవుతోంది.

news18-telugu
Updated: July 27, 2019, 6:24 PM IST
బీజేపీ ఎటాక్‌పై వైసీపీ సైలెన్స్... జగన్ వ్యూహం ఏంటి ?
వైఎస్ జగన్ (File)
  • Share this:
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికలకు ముందు, ఆ తరువాత కొద్ది రోజుల వరకు ఏపీలోని వైసీపీకి సపోర్ట్‌గా ఉన్న బీజేపీ... ఇప్పుడు రూటు మార్చింది. ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతలు...అప్పుడే వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ నేతలు కనీసం మూడు నెలల సమయం కూడా ఇవ్వడం లేదని వారి మాటలను బట్టి అర్థమవుతోంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్యనాయకురాలు పురంధేశ్వరి రోజూ ఎక్కడో ఒక చోట వైసీపీని, సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మొన్నీమధ్యే బీజేపీకి చెందిన జాతీయస్థాయి కీలక నేత రామ్‌మాధవ్ సైతం వైసీపీని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ స్పందించడం లేదు. తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి టీడీపీని తీవ్రంగా విమర్శిస్తున్న వైసీపీ నేతలు... తమను టార్గెట్ చేస్తున్న బీజేపీ గురించి అస్సలు మాట్లాడటం లేదు. దీంతో అసలు బీజేపీపై వైసీపీ రాజకీయ వ్యూహం ఏమిటనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే వైసీపీ నేతలు బీజేపీ విషయంలో వ్యూహాత్మకంగానే సమన్వయంగా ఉంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇప్పటికప్పుడే రాజకీయ వైరం కొనితెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదని వైసీపీ బలంగా నమ్ముతోంది.

తాము టీడీపీని వదిలి బీజేపీని విమర్శించడం మొదలుపెడితే... రాష్ట్రం రాజకీయాలన్నీ దీని మీదే తిరుగుతాయని వైసీపీ భావిస్తోంది. అంతేకాదు... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొలిటికల్ వార్‌కు దిగితే దీన్ని టీడీపీ ఓ అవకాశంగా మార్చుకునే వీలుందని వైసీపీ భావిస్తోంది. అందుకే బీజేపీ కవ్వింపు చర్యలు ఏ మాత్రం స్పందించకూడదని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తమ పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ విషయంలో ఏపీ అధికార పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు కనిపిస్తోంది.First published: July 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...