ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటారు.. ఇక్కడేమో.. : టీఆర్ఎస్‌పై లక్ష్మణ్ విసుర్లు

అంగన్‌వాడీలకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అంగన్‌వాడీలను మూసివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

news18-telugu
Updated: December 13, 2019, 1:09 PM IST
ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటారు.. ఇక్కడేమో.. : టీఆర్ఎస్‌పై లక్ష్మణ్ విసుర్లు
సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర లక్ష్మణ్(File Photo)
  • Share this:
టీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ఉన్న పెద్దల కాళ్లు పట్టుకుంటారని.. హైదరాబాద్‌కి వచ్చి మాత్రం కన్నీళ్లు పెట్టకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారని టీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, రైతులకు భరోసా లేదని అన్నారు. దిశ,సమత,మానస లాంటి ఘటనలు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను
ప్రశ్నిస్తున్నాయన్నారు. ఆర్థికమంత్రి ప్రమేయం లేకుండానే సమీక్షలు జరుపుతున్న సీఎం.. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.

రాష్ట్రంలో పసిపిల్లల నుంచి వృద్దుల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అంగన్‌వాడీలకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అంగన్‌వాడీలను మూసివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. ఇప్పటికీ దాన్ని అమలుచేయలేదన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని.. హరితహారం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. హరితహారం కింద ఎన్ని మొక్కలు నాటారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>