Home /News /politics /

Sadineni Yamini: వైసీపీ వైపు యామిని చూపు..? పొలిటికల్ స్కెచ్ బాగానే ఉందిగా..!

Sadineni Yamini: వైసీపీ వైపు యామిని చూపు..? పొలిటికల్ స్కెచ్ బాగానే ఉందిగా..!

సాధినేని యామిని, వైఎస్ జగన్ (ఫైల్)

సాధినేని యామిని, వైఎస్ జగన్ (ఫైల్)

AP Politics: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఈరోజు ఓ పార్టీలో ఉన్నవారు రేపు మరోపార్టీలో ఉండొచ్చు. అధికారం చేతులు మారినప్పుడు నాయకుల వలసలు సర్వసాధారణం..

  M.బాలకృష్ణ, హైదరాాబాద్ ప్రతినిధి,  న్యూస్18

  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఈరోజు ఓ పార్టీలో ఉన్నవారు రేపు మరోపార్టీలో ఉండొచ్చు. అధికారం చేతులు మారినప్పుడు నాయకుల వలసలు సర్వసాధారణం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ట్రెండే నడుస్తోంది. ఏపీలో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతలు పార్టీలు మారారు. కొందరు వైసీపీ కండువా కప్పుకుంటే.. వైసీపీతో పొసగనివారు కమలదళంలో చేరారు. ఆలాంటి నేతల్లో మాజీ టీడీపీ.. ప్రస్తుత బీజేపీ నేత సాధినేని యామిని ఒకరు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తనదైన దూకుడు ప్రదర్శించి అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు యామిని. అప్పట్లో ప్రతిపక్షం వైసీపీతో పాటు జనసేన, బీజేపీల మీద కూడా ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు. ఆ టాలెంట్ చూసే టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెను అధికార ప్రతినిథిని చేశారు. ఆ తర్వాత జనసేన, బీజేపీలపై మాటల తూటాలు పేలస్తూ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గుర్తింపు పొందారు.

  2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో సైలెంట్ అయిన యామిని ఆ తర్వాత తన పొలిటికల్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని బీజేపీలేకి జంప్ అయ్యారు. అక్కడ కూడా అధికార ప్రతినిథిగా పార్టీ పదవిని దక్కించుకున్నారు. ఐతే బీజేపీలోకి వెళ్లి ఓ వెలుగు వెలుగుదామన్న ఆమె కలలు కల్లలుగానే మిగిలినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో ఆమెకు అంతగా పొసగడం లేదని.. టీడీపీలో ఉన్న స్వేచ్ఛ ఇక్కడ లేదని ఆమె సన్నిహితుల వద్ద తెగబాధపడిపోతున్నట్లు సమాచారం.

  ఇది చదవండి: అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్... ఆ పథకాలే కొంపముంచుతున్నాయా..?  ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్న ఇక్క‌డ ఆమెకు బిజేపీ నేత‌ల‌తో పొస‌గ‌డం లేద‌ని తెలుస్తోంది. టీడీపీలో ఉన్న స్వ‌చ్చ ఈ పార్టీలో లేక‌పోవ‌డం ఆమెను క‌లిచివేస్తోన్న అంశంగా ఆమె స‌న్నిహితుల స‌మాచారం. బీజేపీ నేతలు ఆమెను పట్టించుకోకపోవడంతో పార్టీ ముఖ్య నేతలకు ఆమెకు గ్యాప్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ నేప‌థ్యంలోనే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఆమె స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు కూడా చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థ‌తిలో వైసీపీ త‌ప్ప మ‌రో ప్రత్యామ్నాయం లేదని కూడా ఆమె భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌ల‌తో ఆమె ట‌చ్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. యామిని బిజేపీలో చేరిన‌ప్పుడు చంద్ర‌బాబే బిజేపీలోకి పంపారు అనే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు ఒక వేళ అధికాపార్టీలో చేరితే త‌న‌కంటే ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంద‌ని ఆమె భావిస్తున్నారట.

  ఇది చదవండి: ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారా..? పిలిచి క్లాస్ పీకడం ఖాయమా..?


  వైసీపీలో చేరడం ద్వారా టీడీపీలో ఉన్నప్పుడు సొంతపార్టీ నేతలే సొషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయించారని.. వాటికి కూడా సరైన సమాధానం చెప్పాలని యామిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో బాగంగానే వైసీపీ నేత‌ల‌తో ఆమె ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు స‌మ‌చారం. గతంలో టీడీపీ నుంచి వచ్చిన రోజాను.. ఇప్పుడు అదే పార్టీపైకి ప్రధాన అస్త్రంగా ఎలా ప్రయోగిస్తున్నారో తాను కూడా వైసీపీకి ప్లస్ అవుతానని అధికార పార్టీ నేతలకు ఆమె చెబుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి యామిని ఉపయోగపడతారనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. మరి ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుదామని వచ్చిన యామినికి వైసీపీలో చోటు దక్కుతుందా..? ఒకవేళ దక్కినా ప్రాముఖ్యత లభిస్తుందా..? అనేది వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Sadineni yamini, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు