గాంధీ పాకిస్తాన్‌కే జాతి పిత.. భారత్‌కు కాదు.. బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

జాతి పిత పాకిస్తాన్‌కే జాతి పిత, భారత్‌లో ఆయనలాంటి పుత్రులు కోట్లలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: May 17, 2019, 12:51 PM IST
గాంధీ పాకిస్తాన్‌కే జాతి పిత.. భారత్‌కు కాదు.. బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ సుమిత్ర
news18-telugu
Updated: May 17, 2019, 12:51 PM IST
మహ్మాతా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాడ్సేను ఉగ్రవాది అని పిలుస్తున్న వారికి ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరిగే సమాధానం ఇస్తారని ఆమె చెప్పారు. గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడేనని ఆమె చెప్పారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువని గాడ్సేను ఉద్దేశించి ఇటీవల కమల్ హాసన్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకు గానూ కౌంటర్‌గానే సాధ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంత్ హెగ్డే కూడా గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరో బీజేపీ నేత గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ పాకిస్తాన్‌కే జాతి పిత అని, భారత్‌కు ఆ పార్టీ అధికార ప్రతినిధి అనిల్ సుమిత్ర తీవ్రంగా వ్యాఖ్యానించారు. గాంధీ పేరును ప్రస్తావించకపోయినా తన ఫేస్‌బుక్ పోస్టులో ‘జాతి పిత పాకిస్తాన్‌కే జాతి పిత, భారత్‌లో ఆయనలాంటి పుత్రులు కోట్లలో ఉన్నారు’ అని పేర్కొన్నారు.

మరోవైపు, కర్ణాటక బీజేపీ ఎంపీ నలిన్ కుమార్ కూడా, మాట్లాడుతూ.. 'గాడ్సే ఒక్కడిని చంపితే.. కసబ్ 72మందిని చంపితే.. రాజీవ్ గాంధీ 17000మందిని హత్య చేశాడు. దీన్ని బట్టి ఎవరు అత్యంత క్రూరులో మీరే ఆలోచించుకోండి.' అని వ్యాఖ్యానించారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోతను ఉద్దేశిస్తూ రాజీవ్ గాంధీపై నలిన్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.



First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...