Year Ender 2019 | మోదీ షా ప్రభంజనం... అన్నీ సంచలనాలే...

Year Ender 2019 | మోదీ షా ప్రభంజనం... అన్నీ సంచలనాలే...

మోదీ, అమిత్ షా (File)

జాతీయ స్థాయిలో ఈ ఏడాది బీజేపీదే అని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు పక్కనపెడితే... కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం... కీలకమైన అంశాలకు పరిష్కారం దిశగా అడుగులు వేయడం ఈ ఏడాదిలో జరిగింది.

 • Share this:
  కాలం గిర్రున తిరిగింది..! కాలెండర్‌మారబోతోంది. కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త ఏడాదే కాదు.. కొత్త దశాబ్ధంలోకి అడుగు పెడుతున్నాం. ఒక్క ఏడాదిలో ఎన్నో విషయాలు.. మెరుపులు, మరకలు, దేశాన్ని కుదిపేసిన వివాదాలు..! సంబరాల్లో నింపిన అంశాలు.. ఇలా ప్రతిదీ స్పెషల్‌గా కనిపిస్తుంది. కానీ ఈ ఏడాదిలో రాజకీయంగా హాట్‌టాపిక్‌. ఎందుకంటే ఈ ఏడాదే ఎన్నికలు జరిగాయి.

  ఈ ఏడాది బీజేపీ రాజకీయంగా సంచలనం సృష్టించింది. 2014 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ... ఈ ఎన్నికల్లో మళ్లీ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాము గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎంతో ధీమా వ్యక్తం చేశారు. వారి వాదనే నిజమైంది. ఏప్రిల్, మే నెలల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలున్న పార్లమెంట్‌లో 303 స్థానాల్లో విజయం సాధించి... ప్రత్యర్థులకు అంతనంత ఎత్తునలో నిలిచింది. మరోసారి ప్రతిపక్ష దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ... ఈ సారి కూడా ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు.

  rahul gandhi,priyanka gandhi,sonia gandhi,priyanka gandhi vadra,priyanka gandhi speech,rahul gandhi speech,indira gandhi,priyanka gandhi son,priyanka gandhi house,rahul gandhi news,rahul gandhi latest speech,rahul gandhi priyanka gandhi,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ,
  రాహుల్ గాంధీ (File Photo)


  ఆర్టికల్‌370 రద్దు చేయడం ఈ ఏడాది కేంద్రంలోని బీజేపీ చేపట్టిన అతి పెద్ద రాజకీయ సంస్కరణ అని చెప్పుకోవాలి. జమ్మూకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే చట్టాన్ని కేంద్రం రద్దు చేసింది. రాష్ట్రపతి ఆర్డినెన్స్‌తో జమ్ముకశ్మీర్‌.. రెండు ప్రాంతాలుగా విడిపోయింది. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో పాటు జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. పక్కా పకడ్బందీ వ్యూహంతో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా... ఈ మొత్తం ఆపరేషన్‌ను రాజకీయంగా పూర్తి చేశారు.

  దేశంలో అనేక అంశాలు రాజకీయంగా మలుపులు తిప్పాయి. ముఖ్యంగా కర్ణాటకలో రాజకీయం ఈ ఏడాది యూటర్న్ తీసుకుంది. బీజేపీని అధికారంలోకి తీసుకురావొద్దంటూ... ఒక్కటైన జేడీఎస్‌, కాంగ్రెస్‌లు అధికారంలోకి వచ్చాయి. అయితే రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలతో కొత్త మలుపు తిరిగింది. అయితే దీనిపై విశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టిన కుమారస్వామి.. అనేక నాటకీయత మధ్య సీఎం పదవి నుంచి వైదొలిగారు. ఆ తరువాత బీజేపీ నేత యడ్యూరప్ప సీఎం కావడం... తన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంతో... కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి సుస్థిరత ఏర్పడింది.

  maharashtra news, maharashtra cm, maharashtra sanjay raut, maharashtra cabinet, sanjay raut news, maharashtra politics, shiv sena news, మహారాష్ట్ర రాజకీయాలు, శివసేన సర్కారు, ఉద్దవ్ థాకరే, సంజయ్ రౌత్, సునీల్ రౌత్
  మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే


  అయితే మహారాష్ట్రలో మాత్రం బీజేపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఫడ్నవీస్‌.. అజిత్‌పవార్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అర్ధరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేశారు. దీనిపై రాజకీయంగా దుమారం రేగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో బలపరీక్ష ముందే ఫడ్నవీస్‌ తప్పుకున్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు.

  ఇక ఈ ఏడాది అయోధ్య వివాదం కూడా పరిష్కారమైందని చెప్పాలి. నిజానికి ఎన్నికలకు ముందు అయోధ్యపై ఆర్డినెన్స్‌జారీ చేస్తారని భావించారు. కానీ దీనికి కోర్టు పరిష్కారం చూపింది. అయితే కోర్టు నుంచి పరిష్కారం రావడంతో రాజకీయ పక్షాలు నోరు మెదపలేదు. దీంతో ఏళ్లుగా నానుతున్న వివాదానికి ఇక్కడితో తెరపడింది. అంతకుముందు.. అయోధ్య వ్యవహారంపై రాజకీయ రగడ చోటు చేసుకున్నప్పటికీ.. కోర్టులో అంశం ఉండటంతో రాజకీయ పక్షాలు హద్దు మీరి వ్యవహరించలేదు. అయితే ఈ దశాబ్ధంలోని ఓ కీలకమైన సమస్యకు పరిష్కారం దొరికిందంటే అది అయోధ్యకే అని చెప్పవచ్చు. అయితే సున్నీ బోర్డుకు భూమి ఇవ్వడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయోధ్య మందిరం, కమిటీపై నిర్ణయం ఉంటుందని చెబుతున్నా.. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు లేవు. అయితే సుప్రీంకోర్టు తీర్పును రివ్యూ చేయాలని పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ.. వాటిని కూడా కోర్టు కొట్టేసింది.

  Ayodhya verdict, supreme court, sunni waqf board, అయోధ్య తీర్పు, సుప్రీంకోర్టు, సున్నీ వక్ఫ్ బోర్డు
  ప్రతీకాత్మక చిత్రం


  దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన మరో అంశం ట్రిపుల్‌తలాక్‌. ట్రిపుల్‌తలాక్‌చట్టం రాజకీయంగా ప్రకంపనలకు కారణమైంది. ట్రిపుల్‌తలాఖ్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం చేయడంపై విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా క్రిమినల్‌కేసులు నమోదు చేయాలన్న నిబంధనను కాంగ్రెస్‌తో సహా ప్రధాన విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు గతేడాదే లోక్‌సభలో ఆమోదం పొందినా.. తర్వాత మార్పు, చేర్పులతో జూలై 30న పార్లమెంట్‌ ఆమోదించింది.

  అయితే ఈ ఏడాది బీజేపీకి సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అంశం ఇబ్బందిగా మారింది. ఎన్‌ఆర్‌సీపై ముందు నుంచి ఆందోళనలు ఉన్నప్పటికీ.. సీఏఏను పార్లమెంట్‌ ఆమోదించిన తర్వాత ఆందోళనలు మరింతగా పెరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు టర్మ్‌లలోనూ ఈ స్థాయిలో వ్యతిరేకతను చూడలేదు. అయితే సీఏఏ భారత్‌లోని ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రభుత్వం ఎంతగా సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే విపక్షాలు మాత్రం ఎన్‌ఆర్‌సీ, సీఏఏ రెండూ అత్యంత ప్రమాదకరమంటూ మండిపడుతున్నాయి.సీఏఏ వ్యతిరేక ఆందోళనలు సద్దుమణగముందే... ఎన్‌పీఆర్‌ పేరుతో కొత్త జాతీయ జనాభా రిజిస్ట్రర్‌ను తీసుకొచ్చింది కేంద్రం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా... ఎన్‌పీఆర్‌ను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: