లక్ష్మణ్ స్థానంలో కొత్త అధ్యక్షుడు... సీనియర్ నేత సంకేతాలు

గతంలోనూ పార్టీలో తన కంటే జూనియర్లు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి నాయకత్వంలో పని చేసిన విషయాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు.

news18-telugu
Updated: February 21, 2020, 3:54 PM IST
లక్ష్మణ్ స్థానంలో కొత్త అధ్యక్షుడు... సీనియర్ నేత సంకేతాలు
విద్యాసాగర్ రావు(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌కు మరో ఛాన్స్ ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం సుముఖంగా లేదా ? ఈ సారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుందా ? బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. బీజేపీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని స్పష్టం చేసిన విద్యాసాగర్ రావు... తాను సీఎంలతో ప్రమాణాలు చేయించినవాడినని అన్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి రాబోతున్నారని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి నియామకం హైకమాండ్ చేతిలో ఉంటుందని... తాను రాష్ట్ర బిజేపీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

గతంలోనూ పార్టీలో తన కంటే జూనియర్లు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి నాయకత్వంలో పని చేసిన విషయాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటోందని అన్నారు. సీఏఏపై రాష్ట్ర ప్రభుత్వం చేసే తీర్మానం పనిచేయదని... దీనిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్2పై నిరసనలు చేయలేదు కానీ...సీఏఏపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విద్యాసాగర్ రావు విమర్శించారు.


First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు