• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • BJP SENIOR LEADER UMA BHARATI SENSATIONAL COMMENTS ON TEJASHWI YADAV READ HERE MS

Tejaswi Yadav పై బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు

ఉమా భారతి

బీజేపీ తొలితరం నాయకురాలు.. ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఇంకా అనుభవం రాలేదని.. కానీ మంచి కుర్రోడని కొనియాడారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి పేరు చెబితేనే ఎవరైనా హడలిపోవాల్సిందే. ప్రతిపక్షాలపై తరుచూ విరుచుకుపడే ఆమె.. తమ పార్టీకి గట్టి పోటీనిచ్చిన వ్యక్తులను మెచ్చుకోవడం చాలా అరుదు. ఫైర్ బ్రాండ్ పొలిటిషియన్ గా పేరున్న ఉమా భారతి.. తాజాగా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజస్వికి ఇంకా రాష్ట్రాన్ని పాలించే అనుభవం రాలేదని.. కానీ ఎప్పటికైనా బీహార్ ను ఏలేది అతడేనని కొనియాడారు. ఒకవైపు బీహార్ లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి.. చివరిదాకా ఎన్డీయే కూటమికి చుక్కలు చూపించిన నాయకుడిపై స్వయంగా అధికార పార్టీకి చెందిన నాయకురాలే పొగడటం ప్రాధాన్యతం సంతరించుకుంది.

    భోపాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉమాభారతి మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ చాలా మంచి కుర్రాడని వ్యాఖ్యానించారు. అతడికి మంచి భవిష్యత్ ఉన్నదని ఆమె ప్రశంసించారు. విజయం తమ పార్టీకి వరించిన నేపథ్యంలో.. తేజస్వి చాలా చిన్న కుర్రాడని అన్నారు. రాష్ట్రాన్ని పాలించేంత అనుభవం ఇంకా అతడికి రాలేదని ఆమె తెలిపారు. లాలూ చేసిన తప్పుల కారణంగా తేజస్వి అధికారం కోల్పోయారని కూడా ఆమె అన్నారు.

    ‘తేజస్వి చాలా మంచి కుర్రాడు. అతడికి రాష్ట్రాన్ని నడిపేంత అనుభవం రాలేదు. కానీ అతడు భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి రాజకీయ నాయకుడవుతాడు’ అని కొనియాడారు. ఇక మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలపైనా ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ ఎన్నికలలో గెలుపు కోసం చాలా కృషి చేశారని అన్నారు. గతంలో ఆయన ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపిస్తే కమల్ నాథ్ కు ఈనాడు ఈ సమస్యలు వచ్చేవి కావని ఆమె అన్నారు. కమల్ నాథ్ తనకు సోదర సమానుడని.. ఆయనను ఎప్పుడూ గౌరవిస్తానని ఉమాభారతి చెప్పారు. ఈ ఎన్నికలలో ఆయన వ్యూహాత్మకంగా పోరాడినా విజయం మాత్రం బీజేపీనే వరించిన విషయం విదితమే.

    మరోవైపు బీహార్ లో తేజస్వి యాదవ్ కష్టపడినా కాంగ్రెస్ నిలువునా ముంచడంతో ఆయన విజయం ముంగిటే ఆగిపోయారు.  మరోవైపు జేడీ(యూ)  ఈ ఎన్నికల్లో దారుణంగా చతికిలపడినా.. బీజేపీ సపోర్ట్ తో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
    Published by:Srinivas Munigala
    First published: