ఈ రోజు మధ్యాహ్నం 2:30కి జైట్లీ అంత్యక్రియలు.. కడసారి చూపు కోసం..

Arun Jaitley: అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఢిల్లీలోని కైలాస్ కాలనీలోగల ఆయన నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే ఉంచనున్నారని.. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు తెలిపారు.

news18-telugu
Updated: August 25, 2019, 10:58 AM IST
ఈ రోజు మధ్యాహ్నం 2:30కి జైట్లీ అంత్యక్రియలు.. కడసారి చూపు కోసం..
అరుణ్ జైట్లీ
  • Share this:
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఢిల్లీలోని కైలాస్ కాలనీలోగల ఆయన నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే ఉంచనున్నారని.. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయని చెప్పారు. కాగా, జైట్లీ కడసారి చూపుల కోసం పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోహ్రా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్ఎల్డీ నేత అజీత్ సింగ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

నివాళులర్పించిన వారిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. మరోవైపు, బహ్రెయిన్ పర్యటనలో ఉన్న మోదీ.. జైట్లీ మృతితో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ‘నా స్నేహితుడు అరుణ్ జైట్లీని కోల్పోయా’ అని వ్యాఖ్యానించారు. బహ్రెయిన్‌లోని భారతీయ కమ్యూనిటీ ప్రజలతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.


First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు