బీజేపీ అభ్యర్థుల ఆరో జాబితా.. సుమలతపై సంచలన నిర్ణయం

సుమలత భర్త అంబరీష్ కాంగ్రెస్ నేత. అయితే, పొత్తుల్లో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీంతో సుమలత స్వతంత్రంగా బరిలో దిగారు.

news18-telugu
Updated: March 29, 2019, 7:18 PM IST
బీజేపీ అభ్యర్థుల ఆరో జాబితా.. సుమలతపై సంచలన నిర్ణయం
నరేంద్ర మోదీ, అమిత్ షా (File)
  • Share this:
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ నేత జేపీ నడ్డా కొత్త లిస్ట్‌ను రిలీజ్ చేశారు. 48 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గోవాలో పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతోపాటు గోవా, గుజరాత్‌లో జరగబోయే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీనియర్ నేత ఉమా భారతిని పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు.

బీజేపీ జాబితా..

బీజేపీ అభ్యర్థుల జాబితా


బీజేపీ అభ్యర్థుల ఆరో జాబితా




అయితే, మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది బీజేపీ. కర్ణాటకలో మాండ్యా పార్లమెంట్ నియోజకవర్గానికి తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న అంబరీష్ సతీమణి సుమలత అంబరీష్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. మాండ్యా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, జేడీఎస్ పొత్తులో భాగంగా కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మాండ్యా నియోజకవర్గంలో సుమలతకు మద్దతిస్తున్నట్టు తెలిపిన బీజేపీ


సుమలత భర్త అంబరీష్ కాంగ్రెస్ నేత. అయితే, పొత్తుల్లో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీంతో సుమలత స్వతంత్రంగా బరిలో దిగారు.
First published: March 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు