యాదాద్రిలో ఉద్రిక్తత.. ర్యాలీగా బయలుదేరిన బీజేపీ కార్యకర్తల అరెస్ట్

యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్ ముఖచిత్రం,టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు,ప్రభుత్వ పథకాల చిహ్నాలు ఆలయ ప్రాకారాలపై చెక్కించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్,బీజేపీ శ్రేణులు దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి.

news18-telugu
Updated: September 7, 2019, 5:21 PM IST
యాదాద్రిలో ఉద్రిక్తత.. ర్యాలీగా బయలుదేరిన బీజేపీ కార్యకర్తల అరెస్ట్
బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
news18-telugu
Updated: September 7, 2019, 5:21 PM IST
తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణ బీజేపీ శ్రేణులు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో యాదాద్రి కొండపైకి ర్యాలీగా బయలుదేరగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.కొండ పైకి కొందరినే అనుమతిస్తామని.. అందరినీ అనుమతించేది లేదని చెప్పారు. అయితే అందరినీ అనుమతించాల్సిందేనని లక్ష్మణ్ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి బలవంతంగా అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జి కూడా జరిగినట్టు తెలుస్తోంది. యాదాద్రి అష్టభుజి ప్రాకారాలపై కేసీఆర్ ఫోటోలు తొలగించేదాకా తమ ఆందోళనలు కొనసాగుతాయని లక్ష్మణ్ అన్నారు.

ఇదిలా ఉంటే, యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్ ముఖచిత్రం,టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు,ప్రభుత్వ పథకాల చిహ్నాలు ఆలయ ప్రాకారాలపై చెక్కించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్,బీజేపీ శ్రేణులు దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. సోషల్ మీడియాలో హిందుత్వ వాదులు,సాధారణ నెటిజెన్స్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్‌ తనను తాను ఓ మహారాజులా ఊహించుకుంటూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని మండిపడుతున్నారు.ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందన రాలేదు. వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు మాత్రం ప్రాకారాలపై కేసీఆర్ శిల్పాలను సమర్థించే ప్రయత్నం చేశారు.స్తపతి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో సమానమన్నారు. ఫలానా బొమ్మ చెక్కండని శిల్పులకు ఎవరూ ఆదేశాలు ఇవ్వలేదన్నారు. శిల్పులు తమకు స్ఫూర్తినిచ్చిన దాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తారన్నారు.First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...