టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సోదరి పురంధేశ్వరి ఝలక్...

బాలకృష్ణ, పురంధేశ్వరిలకు దగ్గరి బంధువులను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు పురంధీశ్వరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 26, 2019, 8:46 AM IST
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సోదరి పురంధేశ్వరి ఝలక్...
బాలకృష్ణ (File)
  • Share this:
తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోనే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. వారితోపాటు మాజీఎమ్మెల్యే అంబికా కృష్ణ సైతం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం మరవకముందే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బతగిలింది. పామర్రు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణబాబు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

పొట్లూరి కృష్ణబాబు తన భార్యతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న పురంధీశ్వరి బాలకృష్ణకు సమీప బంధువును టీడీపీ నుంచి లాగేసి పెద్ద ఝలక్ ఇచ్చారు. ఇకపోతే బాలకృష్ణ, పురంధీశ్వరిలకు దగ్గరి బంధువులను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు పురంధీశ్వరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున హిందూపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అయితే తాజాగా పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణను కూడా పార్టీని వీడకుండా బాలయ్య ఆపలేకపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు లండన్ పర్యటన ముగించుకొని అమరావతికి చేరుకున్న చంద్రబాబు... పార్టీలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆరాతీసినట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో ఆయన ఈ విషయంపై చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తల్లో టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. మరి వీటిని నిలువరించేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహం రచిస్తారో వేచి చూడాల్సిందే.

 

First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>