బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు క్లాస్ తీసుకున్న నడ్డా...

బీజేపీ ఎంపీ నరసింహారావుపై ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: March 7, 2020, 11:40 AM IST
బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు క్లాస్ తీసుకున్న నడ్డా...
జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పార్టీ నేతలెవరికీ సమాచారం ఇవ్వకుండా ఆయన ఏపీ గవర్నర్‌ను కలిశారు. దీనిపై కొందరు పార్టీ నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో పాటు ఏపీలో వ్యవహారాలకు సంబంధించి జీవీఎల్ నరసింహారావు చేస్తున్న వ్యాఖ్యలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయని కొందరు నేతలు పార్టీ అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో జేపీ నడ్డా జీవీఎల్‌ను పిలిపించుకుని ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన తీరుపై జేపీ నడ్డా అసంతృప్తి వ్యక్తం చేశారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే జీవీఎల్ పై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తల్లో నిజం లేదని, బీజేపీ విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు కొర్రపోలు శ్రీనివాసరావు వివరించారు. ఒక రాజ్యసభ సభ్యుడు, గవర్నర్ ను కలవాలంటే పార్టీలో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, తదనుగుణంగానే జీవీఎల్ ను కలుసుకున్నారని చెప్పారు. జీవీఎల్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొందరు అసత్య ప్రచారం చేశారని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: March 5, 2020, 7:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading