చంద్రబాబుకు అమిత్ షా పంచ్.. జగన్‌కు అభినందనలు

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబునాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఎన్నికల ఫలితాలు మొత్తం వన్ సైడ్‌గా రావడంతో చంద్రబాబు ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

news18-telugu
Updated: May 23, 2019, 7:57 PM IST
చంద్రబాబుకు అమిత్ షా పంచ్.. జగన్‌కు అభినందనలు
అమిత్ షా
news18-telugu
Updated: May 23, 2019, 7:57 PM IST
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీద పంచ్ వేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబునాయుడు ఢిల్లీలో కాళ్లకు బలపం కట్టుకుని తెగ తిరిగారని, ఆ కష్టం ఏపీలో పడి ఉంటే చంద్రబాబు పార్టీ కనీసం ఖాతా తెరిచి ఉండేదని సెటైర్ వేశారు. ‘చంద్రబాబునాయుడు 21 పార్టీలను వెంట పెట్టుకుని ఢిల్లీలో తెగ తిరిగారు. అదే కష్టం చంద్రబాబు ఏపీలో పడి ఉంటే కనీసం టీడీపీ ఖాతా తెరిచేది. ఏపీలో జగన్ రెడ్డికి ఘన విజయం దక్కింది. బీజేపీ తరఫున జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నా.’ అని అమిత్ షా అన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబునాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, లక్నో చుట్టూ తిరిగారు. యూపీఏ పార్టీల సహకారంతో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. ఎన్నికల ఫలితాలు మొత్తం వన్ సైడ్‌గా రావడంతో చంద్రబాబు ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...