జగన్ వద్దు పవనే ముద్దు... బీజేపీ పొత్తు వెనుక వ్యూహం ఇదే

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పొత్తు పెట్టుకుంటే తాను బీజేపీకి గుడ్ బై చెబుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలు కూడా కొందరు వైసీపీతో కమలానికి ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: February 17, 2020, 4:42 PM IST
జగన్ వద్దు పవనే ముద్దు... బీజేపీ పొత్తు వెనుక వ్యూహం ఇదే
మోదీ జగన్ పవన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటనతో ఏపీలో మరోసారి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గతంలో చంద్రబాబు పార్టీ టీడీపీ మాదిరిగానే... ఇప్పుడు జగన్ పార్టీ వైసీపీ కూడా కూడా ఎన్డీయేతో జతకడుతుందని వార్తలు గుప్పుమన్నాయి. కేంద్ర కేబినెట్‌లో కూడా జగన్ ఎంపీలకు బెర్త్ లు కన్ ఫర్మ్ అయ్యాయంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్‌తో జగన్ వరుస భేటీలతో అందరిలో కూడా ఆ వార్తలు నిజమేనా ? అన్న ప్రశ్నలు తలెత్తాయి. జగన్ భేటీకి కొన్నిరోజుల ముందే ఢిల్లీ వెళ్లిన పవన్ కొంతమంది పెద్దలతో కలిశారు.  ఏపీలో బీజేపీతో తమ పార్టీ కలిసి పనిచేస్తుందని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. అయితే జగన్ హస్తిన పర్యటనతో మారిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం కాస్త ఘాటుగానే స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పొత్తు పెట్టుకుంటే తాను బీజేపీకి గుడ్ బై చెబుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలు కూడా కొందరు వైసీపీతో కమలానికి ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి కూడా ఈ విషయాన్ని ఖండించారు. కేవలం బీజేపీని మరోసారి దెబ్బ తీసేందుకే ఇలాంటి అసత్యాలను, దుష్ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే వాస్తవానికి బీజేపీకి కూడా జగన్ దోస్తీ అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా ఏపీలో పాగా వేయడం. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయాల్సిన  పరిస్థితి లేదు. ఎందుకు దేశంలో ఇప్పటికే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో కమలం పార్టీ ఉంది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేసి అనేక రాష్ట్రాల్లో కమలం వికసించింది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆశించనంతగా కమలం పార్టీ సక్సెస్ కాలేదు. కర్నాటకలో కాస్త సక్సెస్ అయినా... ఏపీ, తెలంగాణ, తమిళనాడులో మాత్రం షా, మోదీల పాచికలు పారలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నా...ఏపీ విషయానికి వస్తే మాత్రం జగన్‌తో కలిసి పనిచేస్తే... టీడీపీతో పొత్తు సమయంలో జరిగిన అన్యాయమే మరోసారి కమలానికి ఎదురయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఈ సారి తెలివిగా ఏపీలో కాపులకు మంచి ఓటు బ్యాంక్ ఉంది. అది క్యాష్ చేసుకోవాలంటే... పవన్ వెంట ఉండటమే మంచిదని భావించింది. అందుకే పవన్ పార్టీ జనసేనతో జత కట్టేందుకు బీజేపీ పెద్దలు ముందుకొచ్చారు. వైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందన్న వాదన తెరపైకి వస్తున్నా... అవి ఆచరణలో మాత్రం కనిపించదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభలో వైసీపీకి ఉన్న ఎంపీల సాయం మోదీ సర్కార్ తీసుకుంటుందే తప్పా... జగన్ పార్టీతో మాత్రం కలిసే సమస్యే ఉండదంటున్నారు.

పవన్ కళ్యాణ్, నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)


మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ఇటు బీజేపీ కూడా పవన్‌ను వదులుకొనే పరిస్థితుల్లో లేదు. అందుకే ఆ పార్టీ నేతలంతా వైసీపీ, బీజేపీ పొత్తు అనగానే... భగ్గుమన్నారు. అలాంటిదేమి లేదని ప్రెస్ మీట్‌లు పెట్టి స్పష్టం చేశారు. ఎందుకంటే ఆల్ రెడీ పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపితే... కమలానికే నష్టం అని గతంలోనే తేలింది. పొత్తువల్ల అవతల పార్టీ లాభపడిన.. బీజేపీకి మాత్రం ఎలాంటి పేరు రావడం లేదు. కేవలం తోక పార్టీగానే మిగిలిపోతుందన్న భావన కమలనాథుల్లో వ్యక్తమవుతుంది. అందుకే చిన్నపార్టీ అయిన జనసేనతో కలిపి రానున్న ఎన్నికల వరకు సంస్థాగతంగా తనకంటూ ప్రత్యేకత, ప్రాధాన్యత తెచ్చుకోవాలని బీజేపీ భావిస్తుంది. అందుకే పవన్ కల్యాణ్‌ను వదులుకోవడానికి బీజేపీ మాత్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. జనసేనతో కలిసి పనిచేస్తే బీజేపీకి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కూడా దక్కుతుంది. అటు వైసీపీ కూడా ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదు, మోదీని కలిస్తే.. జగ‌న్‌‌కు ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్ అంతా పోయే ప్రమాదం ఉంది. అదీ కాక ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనే జగన్ గతంలోనే తన ఎంపీలతో రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. ఇలా అనేక రాజకీయ సమీకరణాలు చూసుకుంటే... అటు బీజేపీ కాని... ఇటు వైసీపీ కాని కలిసి పనిచేసే అవకాశమే లేదని పలువురు సీనియర్ రాజకీయ నేతలు, రాజికీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు