కేసీఆర్‌కు చెక్... బీజేపీ నయా ప్లాన్... రంగంలోకి కీలక నేత ?

తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ తరపున బలమైన నేత అవసరమని భావిస్తున్న బీజేపీ... తమ పార్టీకి చెందిన కీలక నాయకుడినే మరోసారి తెరపైకి తీసుకురావాలని యోచిస్తోందని సమాచారం.

news18-telugu
Updated: September 3, 2019, 12:43 PM IST
కేసీఆర్‌కు చెక్... బీజేపీ నయా ప్లాన్... రంగంలోకి కీలక నేత ?
కేసీఆర్ (File)
  • Share this:
తెలంగాణలో ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం... ఈ క్రమంలో మరో ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ తరపున బలమైన నేత అవసరమని భావిస్తున్న బీజేపీ... తమ పార్టీకి చెందిన కీలక నాయకుడినే మరోసారి తెరపైకి తీసుకురావాలని యోచిస్తోందని సమాచారం. తెలంగాణలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పని చేసిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు మరోసారి పొడిగింపు ఇవ్వలేదు బీజేపీ జాతీయ నాయకత్వం. అయితే విద్యాసాగర్ రావు విషయంలో బీజేపీ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో బీజేపీ బలపడుతున్న తరుణంలో మరోసారి విద్యాసాగర్ రావును తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొచ్చే యోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో ఒకప్పుడు బలమైన బీజేపీ నేతగా విద్యాసాగర్ ‌రావుకు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి ఆకర్షించడంపై దృష్టి పెట్టిన బీజేపీ నాయకత్వం... తమ పార్టీకి చెందిన సీనియర్ నేతల సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తోందని... ఈ క్రమంలోనే విద్యాసాగర్ రావును మరోసారి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి విద్యాసాగర్ రావు మరోసారి క్రీయాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అన్న సస్పెన్స్ త్వరలోనే వీడనుంది.
First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading