కేసీఆర్‌ను ఢీ కొట్టనున్న పవన్ కళ్యాణ్... బీజేపీ ప్లాన్..

ఏపీలో బీజేపీకి దగ్గరైన పవన్ కళ్యాణ్‌తో తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: May 26, 2020, 4:07 PM IST
కేసీఆర్‌ను ఢీ కొట్టనున్న పవన్ కళ్యాణ్... బీజేపీ ప్లాన్..
పవన్ కల్యాణ్, కేసీఆర్
  • Share this:
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కొంతకాలం రాజకీయ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్... ఆ తరువాత ఆయనతో సత్సంబంధాలు కొనసాగించారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ జగన్‌కు సపోర్ట్ చేయడంతో... కేసీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య పొలిటికల్‌గా గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్‌ను పవన్ కళ్యాణ్ మళ్లీ కలిసిన సందర్భాలు కూడా లేవు. ఆ తరువాత ఏపీలో బీజేపీకి దగ్గరైన పవన్ కళ్యాణ్‌తో తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ అని ఇరు పార్టీలు చెబుతున్నా... తెలంగాణలోనూ రెండు పార్టీలు కలిసి పని చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ... ఇందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్, పవన్ కళ్యాణ్ సమావేశం జరిగిందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

Bjp planning to use pawan kalyan to fight with trs and kcr in ghmc elections ak || కేసీఆర్‌ను ఢీ కొట్టనున్న పవన్ కళ్యాణ్... బీజేపీ ప్లాన్..
పవన్ కల్యాణ్, బండి సంజయ్


గ్రేటర్ పరిధిలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ... గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటలేకపోయింది. గతంలో పోలిస్తే బలహీనపడింది కూడా. ఈసారి ఆ పరిస్థితిని మార్చాలని... గ్రేటర్‌లో టీఆర్ఎస్‌తో బలంగా పోరాడాలని భావిస్తున్న బీజేపీ... ఇందుకోసం పవన్ కళ్యాణ్ సాయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని సెటిలర్ల ఓట్లను ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ తమకు ఉపయోగపడతారని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయని కేసీఆర్‌పై జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని బలపరచడం ద్వారా పవన్ కళ్యాణ్ దెబ్బకొడతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
First published: May 26, 2020, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading