బీజేపీ స్కెచ్... వర్కవుటైతే జగన్‌కు కష్టమే

టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి... బీజేపీ శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: November 14, 2019, 8:08 PM IST
బీజేపీ స్కెచ్... వర్కవుటైతే జగన్‌కు కష్టమే
సీఎం జగన్
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీ... ఆ ఓటమి నుంచి కోలుకుని అధికార వైసీపీపై రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. ఇందుకోసం తన శక్తియుక్తులన్నింటిని ఉపయోగిస్తున్నారు చంద్రబాబు. అయితే ఏపీలో టీడీపీ బలహీనపడటంతో... రాష్ట్రంలో బలపడాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఇందుకోసం టీడీపీ నేతలను పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేసింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి టీడీపీ ముఖ్యనేతలు సహా ఇప్పటికే అనేక మంది చంద్రబాబుకు షాక్ ఇచ్చి టీడీపీలో చేరిపోయారు. త్వరలోనే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు... తనతో పాటు ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళతారనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై టీడీపీలోనూ అంతర్గతంగా ఆందోళన నెలకొందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గంటా సారథ్యంలో ఏకంగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్షాన్ని తయారుచేసేందుకు పావులు కదుపుతున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.

Ap news, ap politics, tdp, ysrcp, bjp, ap cm ys jagan mohan reddy, kanna, ganta srinivasa rao, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, టీడీపీ, వైసీపీ, బీజేపీ, ఏపీ సీఎం జగన్, కన్నా, గంటా శ్రీనివాసరావు
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)


టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి... బీజేపీ శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకుకోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీలోని ఆ ఎమ్మెల్యేల బృందానికి గంటా శ్రీనివాసరావు సారధ్యం వహిస్తున్నట్టు సమాచారం.

గంటా శ్రీనివాసరావు ఎల్పీ లీడర్ గా మరో ఏడుగురు సభ్యులతో శాసనసభాపక్షంగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో అధికార వైసీపీకి షాక్ ఇచ్చేందుకు బీజేపీ భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది.
First published: November 14, 2019, 8:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading