ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ మీద పోటీ చేయడం ద్వారా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించాలనుకున్న నిజామాబాద్ పసుపు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, వారు నామినేషన్ వేయనివ్వకుండా స్థానిక బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని రైతు నాయకులు ఆరోపించారు. ఎంపీగా పోటీ చేయడానికి ఆ లోక్‌సభ పరిధిలోని పది మంది ఓటర్లు మద్దతు పలకాలి. అయితే, నామినీ ఇస్తామన్న వారిని స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారు. రైతులకు మద్దతు ఇస్తామన్న వారిని బెదిరిస్తున్నట్టు పసుపు రైతులు ఆరోపించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా తమ వెంట పడుతూ పదే పదే విసిగిస్తున్నారని ఆరోపించారు.
వారణాసిలో మోదీ మీద నామినేషన్ వేయడానికి తెలంగాణ నుంచి 50 మంది పసుపు రైతులు అక్కడకు చేరుకున్నారు. తమిళనాడు నుంచి కూడా మరో 50 మంది రైతులు వెళ్తున్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో తాజాగా మొదటి విడుత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 178 మంది రైతులు పోటీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers Protest, Lok Sabha Election 2019, Nizamabad S29p04, Pm modi, Uttar Pradesh Lok Sabha Elections 2019, Varanasi S24p77