తెలంగాణలో బీజేపీ సరికొత్త వ్యూహాలు... కీలక భేటీలు

Telangana : ఓవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైన సమయంలో... బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. రహస్య భేటీలు నిర్వహిస్తోంది.

news18-telugu
Updated: January 3, 2020, 7:37 AM IST
తెలంగాణలో బీజేపీ సరికొత్త వ్యూహాలు... కీలక భేటీలు
లక్ష్మణ్, కిషన్ రెడ్డి
  • Share this:
Telangana : తెలంగాణలో ఇప్పటికీ... ప్రజలు టీఆర్ఎస్‌తోనే ఉన్నారనీ... మరో పార్టీకి ఛాన్స్ లేదని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. కొందరైతే... రాహుల్ గాంధీ కంటే... మంత్రి కేటీఆరే గొప్ప అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలు టీఆర్ఎస్‌కే ఓటు వేస్తారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు, ప్రకటనలు వస్తున్న సమయంలో... బీజేపీ రచిస్తున్న వ్యూహాలు చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి మధ్య రహస్య భేటీలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వీళ్లిద్దరూ తెలంగాణలో బీజేపీకి దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్ర అభిప్రాయాల్ని కిషన్ రెడ్డి చెబుతుంటే... రాష్ట్రంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి చెబుతూ... లక్ష్మణ్ నెక్ట్స్ ఏం చెయ్యాలో హైకమాండ్ పెద్దల నుంచీ తెలుసుకుంటున్నారు. ఐతే... ఇటీవల లక్ష్మణ్‌పై కేంద్ర పెద్దలు ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో... ఆయన స్నేహితుడైన కిషన్ రెడ్డి... లక్ష్మణ్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. గతవారం లక్ష్మణ్ ఇంట్లో ఇలాంటి భేటీ జరగగా... తాజాగా హైదరాబాద్... లక్డీకాపూల్‌లోని... అబోడ్ హోటల్‌లో మరోసారి భేటీ జరిగిందని తెలిసింది. ఇంట్రస్టింగ్ ఏంటంటే... ఈ భేటీకి మోత్కుపల్లి నర్సింహులు కూడా వచ్చారట. ఆయనెందుకూ అంటే... త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారని తెలిసింది. వీళ్లు ముగ్గరూ ఏం చర్చించారన్నది ఆసక్తిగా మారింది. పైకి మున్సిపల్ ఎన్నికలపై చర్చించామని చెబుతున్నా... లోపల విషయం మరొకటని తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆల్రెడీ టికెట్ల టైట్ ఉన్న టీఆర్ఎస్... ఎవరైనా ఆశావహులకు టికెట్ ఇవ్వకపోతే... బీజేపీ ఆ టికెట్లు ఇచ్చి... పార్టీని బలోపేతం చేసుకునే వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీని ఎలాగైనా బలమైన పార్టీగా మార్చేందుకు... తెరవెనక సీక్రెట్ వ్యూహాలు అమలవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: January 3, 2020, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading