• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BJP NATIONAL PRESIDENT JP NADDA GIVES CLARITY OVER NDA CM CANDIDATE FOR BIHAR POLLS

Bihar Elections 2020: బీహార్‌లో మా సీఎం అభ్యర్థి ఆయనే...తేల్చేసిన BJP

Bihar Elections 2020: బీహార్‌లో మా సీఎం అభ్యర్థి ఆయనే...తేల్చేసిన BJP

బీహార్ పార్టీ శ్రేణులనుద్దేశించి వర్చువల్ సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Bihar Elections 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో భారతీయ జనతా పార్టీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

  • Share this:
    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో ఏయే పార్టీలు ఉండబోతున్నాయని, తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్(యునైటెడ్), ఎల్జేపీ‌తో కలిసి బీజేపీ పోటీ చేయబోతున్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో ఎన్డీయే కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీఎం నితీశ్ కుమారే ఉండబోతున్నారని ఆయన వెల్లడించారు. జేడీయు, ఎల్‌జేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో జేపీ నడ్డా ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఈ కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వర్చువల్ సమావేశంలో పార్టీ శ్రేణులనుద్దేశించి జేపీ నడ్డా మాట్లాడారు.

    వర్చువల్ సమావేశంలో పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా


    బీహార్‌లో ఎన్డీయే కూటమి సమైక్యంగా ఉందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. విపక్షాలకు ఓ సిద్ధాంతమంటూ లేదని ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలు చేయడం తప్ప...రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం విపక్షాలకు ఏ మూలానా లేదన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలోనూ...వరద పరిస్థితిని ఎదుర్కోవడంలోనూ బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పని చేసిందని కితాబిచ్చారు. బీహార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం కట్టుబడి ఉంటుందని, దీన్ని బీహార్ బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.



    బీహార్ అసెంబ్లీకి అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
    Published by:Janardhan V
    First published:

    అగ్ర కథనాలు