Home /News /politics /

BJP : పాంచ్ పటాకా పేలాల్సిందే -ఢిల్లీ ఎన్ఎండీసీ వేదికగా జాతీయ కార్యవర్గ భేటీ -మోదీ-షా కీలక మంత్రాంగం

BJP : పాంచ్ పటాకా పేలాల్సిందే -ఢిల్లీ ఎన్ఎండీసీ వేదికగా జాతీయ కార్యవర్గ భేటీ -మోదీ-షా కీలక మంత్రాంగం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గం ఆదివారం నాడు సమావేశమైంది. ఢిల్లీలోని ఎన్ఎండీసీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతోన్న ఈ భేటీలో ప్రధాన చర్చంతా ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే జరిగినట్లు తెలుస్తోంది. పాంచ్ పటాకా మోగించడానికి అవసరమైన వ్యూహాలను కార్యవర్గం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
దేశ వ్యాప్తంగా మారుతోన్న రాజకీయ సమీకరణాలు, వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు, రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం.. తదితర అంశాలే అజెండాగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గం ఆదివారం నాడు సమావేశమైంది. ఢిల్లీలోని ఎన్ఎండీసీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతోన్న ఈ భేటీలో ప్రధాన చర్చంతా ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే జరిగినట్లు తెలుస్తోంది. పాంచ్ పటాకా మోగించడానికి అవసరమైన వ్యూహాలను కార్యవర్గం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కరోనా నిబంధనల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం భిన్నంగా నిర్వహిస్తున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుల్లో కేవలం 124 మంది మాత్రమే ఢిల్లీలోని కన్వెన్షన్ సెంటర్ కు రాగా, మిగతా రాష్ట్రాల్లోని సభ్యులంతా వర్చువల్ విధానంలోనే మీటింగ్ లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గంలోని ఇతర సభ్యులు రాష్ట్ర కార్యాలయాల్లో వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు మీటింగ్ లో పాల్గొననున్నారు. ఏపీ నుంచి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ తదితర కీలక నేతలు పాల్గొన్నారు.

వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం, హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌లో వచ్చే ఏడాది ఆఖర్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పట్టు నిలుపుకునే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్ మినహా అన్ని చోట్లా బీజేపీనే అధికారంలో ఉన్నది. ఈ ఏడు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో మేధోమథనం నిర్వహించనున్నారు.

తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ మినహా చాలా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ చీఫ్ జేపీ నడ్డా కీలక ప్రసంగాలు చేస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసంతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగియనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మోదీ-షా ద్వయం కీలక మంత్రాంగాన్ని నేతలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Amit Shah, Bjp, Delhi, JP Nadda, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు