వైసీపీ సర్కార్‌పై కేంద్రానికి బీజేపీ ఎంపీల ఫిర్యాదు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితులపై బీజేపీ ఎంపీలు అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: March 13, 2020, 4:14 PM IST
వైసీపీ సర్కార్‌పై కేంద్రానికి బీజేపీ ఎంపీల ఫిర్యాదు
వైఎస్ జగన్, అమిత్ షా(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై బీజేపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షాను బీజేపీ ఎంపీలు నరసింహారావు‌, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌ కలిశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితులపై బీజేపీ ఎంపీలు అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఏపీలో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. ఇందుకు సంబంధించి అమిత్‌షాకి లేఖ ఇచ్చారు. వైసీపీ దాడులు, అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని బీజేపీ ఎంపీలు వివరించారు. ఎన్నికల అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారని, నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ ఎంపీలు మీడియాకు వివరించారు. కోర్టు చెప్పినా వైసీపీ పార్టీ రంగులను తొలగించలేదని, ఎన్నికల సంఘం, డీజీపీ సరైన తీరులో స్పందించకపోతే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. దీనిపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: March 13, 2020, 4:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading