అమిత్ షాకు ఏపీ బీజేపీ ఎంపీల ఫిర్యాదు

కేంద్రమంత్రి అమిత్‌‌షాను బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు‌, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌ కలిశారు.

news18-telugu
Updated: March 13, 2020, 4:57 PM IST
అమిత్ షాకు ఏపీ బీజేపీ ఎంపీల ఫిర్యాదు
అమిత్ షా
  • Share this:
కేంద్రమంత్రి అమిత్‌‌షాను బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు‌, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌ కలిశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితులు.. వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులపై అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. అమిత్‌షాకి లేఖ ఇచ్చామని, వైసీపీ దాడులు, అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికల అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారని, నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. కోర్టు చెప్పినా వైసీపీ పార్టీ రంగులను తొలగించలేదని, ఎన్నికల సంఘం, డీజీపీ సరైన తీరులో స్పందించకపోతే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని జీవీఎల్‌  చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ - జనసేన పార్టీలు కలసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఏపీలో పలుచోట్ల ఆ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలపై కూడా వైసీపీ నేతలు దాడిచేశారని రెండు పార్టీలు ఆరోపించారు. నిన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం లోని దుర్గి మండలంలో జనసేన అభ్యర్థులను పోలీస్ అధికారి బెదిరిస్తున్న తీరుపై జనసేన పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ‘కంచరగుంట ఎంపీటీసీ స్థానం నుంచి నామినేషన్ దాఖలుకు వెళ్ళిన ఎస్సీ మహిళ బొంత నిర్మలను దుర్గి ఎస్. ఐ. ఎం. రామాంజనేయులు నానా దుర్భాషలాడి అడ్డుకున్నారు. ఫలితంగా ఆమె నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. దుర్గి మండలంలోని ధర్మవరం ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన తోట పద్మావతినీ, ఆమె కుటుంబ సభ్యులను ఎస్సై రామాంజనేయులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఫలితంగా ఆమె కుటుంబం గ్రామం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

దుర్గి మండలంలో చోటుచేసుకున్న అక్కడ పరిస్థితులను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి జనసేన పార్టీ లీగల్ విభాగం బుధవారం తీసుకెళ్ళింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కలిసి సంఘటన వివరాలను తెలిపి, ఫిర్యాదు పత్రం అందజేసింది. జనసేన అభ్యర్థిని అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురి చేస్తున్న సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల విధుల నుంచి తప్పించాలి.’ అని కోరింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 13, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading