బీజేపీ ఎంపీకి షాక్...ఫోన్ బిల్లుకట్టని ఈసీకి బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు

ప్రతి అభ్యర్థి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో వాటిని కూడా జతపరచాలి. కానీ వరుణ్ గాంధీ ఇలాంటివేమీ చేయలేదు.

news18-telugu
Updated: April 10, 2019, 4:55 PM IST
బీజేపీ ఎంపీకి షాక్...ఫోన్ బిల్లుకట్టని ఈసీకి బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పార్లమెంట్ సభ్యుడంటే మామూలుగా ఉండదు. లక్షల్లో జీతం..విలాసవంతమైన జీవితం...జనాల్లో పలుకుడి..వేలల్లో అనుచరులు..! మరి అలాంటి ఎంపీ ఫోన్ బిల్లు కట్టకుండా ఉంటారా? అని ఆశ్యర్యపోతున్నారా..? ఐతే ఇది నిజం. బీజేపీ ఎంపీ, రాహుల్ గాంధీ సోదరుడు వరుణ్ గాంధీ బీఎస్ఎన్ఎస్‌కు రూ.38 వేలు బాకీపడ్డారట. బిల్లు కట్టాలంటూ ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించడం లేదట. ప్రస్తుతం అతడు పిలిభిత్ నుంచి ఎంపీగా పోటీచేస్తుండడంతో ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది BSNL. వరుణ్ గాంధీ ఫోన్ బిల్లు కట్టలేదని..ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖ రాసింది.

వరుణ్ గాంధీ 2009-14 మధ్య పిలిభిత్ ఎంపీగా పనిచేశారు. ఆ సమయంలో వరుణ్ గాంధీ కార్యాలయానికి రూ.38,616 ఫోన్ బిల్లు వచ్చింది. ఆ బిల్లును ఇప్పటివరకు కట్టలేదని భాతర ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆరోపిస్తోంది. ఆ బిల్లును వరుణ్ గాంధీయే కడతారని లోక్‌సభ కార్యదర్శి గతంలోనే తేల్చిచెప్పారు. కానీ ఇప్పటికీ ఆయన చెల్లించలేదు. మార్చి 29న పిలిభిత్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి BSNL లేఖరాసింది. తమకు వరుణ్ గాంధీ బిల్లుకట్టాల్సి ఉందని..నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోకుండానే నామినేషన్ దాఖలు చేశాడని లేఖరాసింది.

varun gandhi,Pilibhit lok sabha,varun gandhi phone bill,lok sabha elections 2019,lok sabha elections,loksabha election 2019,elections 2019,india lok sabha election 2019,lok sabha election 2019,election shedule,voter id,పిలిభిత్, వరుణ్ గాంధీ, వరుణ్ గాంధీ ఫోన్ బిల్లు
వరుణ్ గాంధీ


ప్రతి అభ్యర్థి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో వాటిని కూడా జతపరచాలి. కానీ వరుణ్ గాంధీ ఇలాంటివేమీ చేయలేదు. నిబంధనలను ఉల్లంఘించినట్లు నిరూపితమైతే సదరు అభ్యర్థి నామినేషన్‌ను ఈసీ రద్దుచేస్తుంది. ఈ నేపథ్యంలో BSNL లేఖపై ఎన్నికల సంఘం పరిశీలన జరుపుతోంది.

కాగా, 2014లో వరుణ్ గాంధీ సుల్తాన్‌పూర్ నుంచి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన పిలిభిత్ నుంచి బరిలో ఉన్నారు. వరుణ్ తల్లి మేనకాగాంధీ సుల్తాన్ పూర్‌ నుంచి పోటీచేస్తున్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా వరుణ్ గాంధీ పోటీచేస్తున్న పిలిభిత్‌లో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమలో బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది హాట్‌టాపిక్‌గా మారింది.
First published: April 10, 2019, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading