చౌకీదార్ టైటిల్ తీసేసిన బీజేపీ ఎంపీ.. ‘ఐ యామ్ వెయిటింగ్’ అంటూ ట్వీట్..

మరోసారి తనకు టికెట్ ఇవ్వకపోతే బీజేపీని వీడతానంటూ వాయువ్య ఢిల్లీ ఎంపీ ఉదిత్ రాజ్ హెచ్చరించారు.

news18-telugu
Updated: April 23, 2019, 2:23 PM IST
చౌకీదార్ టైటిల్ తీసేసిన బీజేపీ ఎంపీ.. ‘ఐ యామ్ వెయిటింగ్’ అంటూ ట్వీట్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 2:23 PM IST
వాయవ్య ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ ఆ పార్టీని వీడనున్నట్టు సంకేతాలు పంపారు. గతంలో తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ‘చౌకీదార్‌’ పదాన్ని కూడా తీసేశారు. మరోసారి తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి గుడ్ బై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘నేను ఎంతో కష్టపడిన నా నియోజకవర్గంలో మరోసారి బీజేపీ తరఫున నాకు టికెట్ దక్కుతుందని ఆశిస్తున్నా. నేను బీజేపీని వీడేలా ఆ పార్టీ ఫోర్స్ చేయబోదని అనుకుంటున్నా’ అని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. ఉదిత్ రాజ్ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌నగర్‌కు చెందిన వారు. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ సంఘానికి ఉదిత్ రాజ్ నేషనల్ చైర్మన్. ఎస్సీ, ఎస్టీల కోసం ఆయన పలు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఏ చదివారు. 1988లో ఐఆర్ఎస్‌కు సెలక్ట్ అయ్యారు. 2003 నవంబర్ 24న అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ (ఢిల్లీ) పదవికి రాజీనామా చేసి ఇండియన్ జస్టిస్ పార్టీ స్థాపించారు. 2014 ఫిబ్రవరి 23న బీజేపీలో చేరారు.

 

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...