• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BJP MP TIRATH SINGH RAWAT TO BECOME NEW CHIEF MINISTER OF UTTARAKHAND SK

Uttarakhand: ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే

Uttarakhand: ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే

తీరథ్ సింగ్ రావత్

56 ఏళ్ల తీరథ్ సింగ్ రావత్ ప్రస్తుతం గర్హ్వాల్ ఎంపీగా ఉన్నారు. గతంలో 2013 నుంచి 2015 వరకు ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు ఎమ్మెల్యేగానూ సేవలందించారు.

  • Share this:
    ఉత్తరాఖండ్‌కు కొత్త సీఎం రాబోతున్నారు. బీజేపీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్‌‌ను ఉత్తరాఖండ్ సీఎంగా ఆ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. ఈ మేరకు మాజీ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. 56 ఏళ్ల తీరథ్ సింగ్ రావత్ ప్రస్తుతం గర్హ్వాల్ ఎంపీగా ఉన్నారు. గతంలో 2013 నుంచి 2015 వరకు ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు ఎమ్మెల్యేగానూ సేవలందించారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తీరథ్ సింగ్ రావత్‌‌కు ఉత్తరాఖండ్‌ బలమైన బీసీ సామాజికవర్గ నేతగా పేరుంది. బీజేపీ పెద్దలతో పాటు రాష్ట్ర నేతలు కూడా ఆయకే జై కొట్టడంతో.. ఉత్తరాఖండ్ 10వ సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

    మంగళవారం సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎవరన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ధన్ సింగ్ రావత్, భగత్‌సింగ్ కోష్యారీ, రమేష్ పొఖ్రియాల్ నిషాంక్, సత్పల్ మహారాజ్ సహా పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా ధన్ సింగ్ పేరు ఖరారయిందని ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ అనూహ్యంగా తీరథ్ సింగ్‌ను సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ. ఇవాళ సాయంత్రమే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.


    త్రివేంద్ర సింగ్ రావత్ నాయకత్వం మీద తీవ్ర అసంతృప్తి రావడంతో ఆయన్ను పార్టీ పెద్దలు సీఎం పదవి నుంచి తప్పించారు. ఆయనకు వ్యతిరేకంగా కొందరు నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు కూడా సీఎం రావత్‌కు వ్యతిరేకంగా చక్రం తిప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితి గురించి వాకబు చేసేందుకు ఢిల్లీ పెద్దలు ఉత్తరాఖండ్‌కు ఒక టీమ్‌ను పంపారు. ఆ టీమ్ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించి రిపోర్టు ఇచ్చింది. అనంతరం ఢిల్లీ అధిష్టానం రావత్‌ను పిలిపించి మాట్లాడింది. నిన్న ఢిల్లీ వెళ్లి వచ్చిన రావత్ మంగళవారం గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం ఇవాళ ఉదయం శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీరథ్ సింగ్ రావత్‌ను ఉత్తరాఖండ్ సీఎంగా ప్రకటించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: