news18-telugu
Updated: August 25, 2019, 2:47 PM IST
ఈ క్రమంలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్డీయేను రద్దు చేసి.. ఆ స్థానంలోనే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఇటీవల టీడీపీను వీడి బీజేపీలోకి వెళ్లిన ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రకు నాలుగు రాజధానలు ఉండబోతున్నాయంటూ బాంబు పేల్చారు. అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని చెప్పారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడుతూ రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా ప్రొజెక్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యాఖ్యలు చేశారు టీజీ. ఈ విషయం బీజేపీ అధిష్ఠానమే తనకు తెలిపిందన్నారు. అధికార పార్టీ వైసీపీ ఆలోచన ప్రకారం నవ్యాంధ్రకు ఒకటి కాకుండా నాలుగు రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు.
పోలవరం టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని ఆరోపించారు టీజీ. పోలవరాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన వారవుతారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ను జగన్ ఎంత తక్కువగా నమ్మితే ఆయన రాజకీయ జీవితానికి అంత మంచిదని టీజీ హితవు పలికారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
August 25, 2019, 2:47 PM IST