Home /News /politics /

ఏపీలో 3కాదు, 2రాజధానులు -సమ్మర్, వింటర్ క్యాపిటల్స్ -సీఎం జగన్‌కు బీజేపీ బంపర్ ఆఫర్

ఏపీలో 3కాదు, 2రాజధానులు -సమ్మర్, వింటర్ క్యాపిటల్స్ -సీఎం జగన్‌కు బీజేపీ బంపర్ ఆఫర్

సీఎం జగన్ తో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్(పాత ఫొటో)

సీఎం జగన్ తో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్(పాత ఫొటో)

రద్దు చేసిన బిల్లుల స్థానంలో మళ్లీ కొత్తగా మూడు రాజధానుల చట్టం చేస్తే దానికి కూడా కోర్టు చిక్కులు తప్పవని, కాబట్టి రాష్ట్రానికి రెండు రాజధానుల కాన్సెప్ట్ ను సీఎం జగన్ అంగీకరించాలని, అమరావతి, కర్నూలు వింటర్, సమ్మర్ క్యాపిటల్స్ గా ఉండాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు.

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు (AP Capital row) వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను తిరిగి వెనక్కి తీసుకోవడం, కోర్టు వివాదాలు తలెత్తకుండా అదే మూడు రాజధానులపై సమర్థవంతమైన బిల్లులను తిరిగి ప్రవేశపెడతామని సీఎం జగన్ (CM Jagan) ప్రకటించడం తెలిసిందే. పాత బిల్లుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో కొత్తగా ప్రవేశపెట్టే బిల్లులపై అన్ని వర్గాల నుంచి వినతులు పెరిగాయి. అమరావతినే రాజధానిగా కొత్త బిల్లు తేవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంటే, ఇన్నాళ్లూ అమరావతిని సమర్థిస్తూ వచ్చిన బీజేపీ మాత్రం అనూహ్య ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఏపీకి మూడు కాదు, రెండు రాజధానులు ఉండాలన్నదే రాయలసీమ వాసుల అభిమతమని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ఇందుకు సీఎం జగన్ ఒప్పుకుంటే కేంద్రాన్ని తాను కన్విన్స్ చేస్తానంటూ టీజీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు..

ఏపీకి రెండు రాజధానులు
సీఎం జగన్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానులు కాకుండా ఏపీలో రెండు రాజధానులు ఉండాలని, సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని రాయలసీమ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. ఏపీలో రాజధాని వివాదానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని, అమరావతి రైతులకు సీఎం జగన్ ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణ పేరుతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య తలెత్తిందని ఆయన ఆరోపించారు. రద్దు చేసిన బిల్లుల స్థానంలో మళ్లీ కొత్తగా మూడు రాజధానుల చట్టం చేస్తే దానికి కూడా కోర్టు చిక్కులు తప్పవని, కాబట్టి తాము చెప్పే రెండు రాజధానుల ప్రతిపాదనకు జగన్ అంగీకరించాలని టీజీ అన్నారు.

వారేవా జగన్!! మూడు రాజధానుల కొత్త బిల్లులో మహా తెతివి -అంతరాత్మను టేబుల్‌పై పెట్టేసి: somuసమ్మర్, వింటర్ క్యాపిటల్స్
మూడు రాజధానుల పేరుతో సీఎం గందరగోళంగానే పరిపాలన కొనసాగిస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదని, రాజధానిని మూడు ముక్కలు చేయకుండా.. ఒక చోట సెక్రటేరియట్‌, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని టీజీ వెంకటేశ్ సూచించారు. కర్నూలులో వెంటనే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసి, తర్వాత పూర్తి స్థాయి హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలని, లేకపోతే రెండూ పోతాయని టీజీ తెలిపారు. విశాఖలో సెక్రటేరియట్‌ పెడితే రాయలసీమ ప్రాంతానికి దూరం అవుతుందని, అందువల్ల కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

నా భార్యనూ గదిలో అలా ఫొటోలు తీశారు -ఆత్మహత్య ఆగింది కూడా ఇందుకే -భువనేశ్వరి ఉదంతో భారీ కుదుపుసీమ త్యాగాలు మరువొద్దు
చరిత్రలో అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదని, తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీకి తెలియజేశామని టీజీ గుర్తుచేశారు. అమరావతి, కర్నూలును వింటర్, సమ్మర్ క్యాపిటల్స్ గా ఉంచేందుకు సీఎం జగన్ అంగీకరించినట్లయితే, ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ను, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటానని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. ఇప్పుడు అమరావతికి రైతులు భూములు ఇచ్చినట్లే, గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకూ సీమ వాసులు భూములు ఇచ్చిన విషయాన్ని మరువొద్దని, సీమతోపాటు అందరికీ న్యాయం జరిగేలా తన ప్రతిపాదనకు సీఎం జగన్ ఒప్పుకోవాలని టీజీ వెంకటేశ్ కోరారు.
Published by:Madhu Kota
First published:

Tags: Amaravati, Ap capital, Ap cm jagan, Bjp, Kurnool, TG Venkatesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు